వైరల్ గా మారిపోయిన ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో తెలిసి ఇక అందరూ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోతున్నారు అని చెప్పాలి. ఆమె ఒకప్పుడు టాలీవుడ్ లోనే కాదు సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ హీరోయిన్. తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అయితే తన నటనతో ఆడియన్స్ లో ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది ఇక ఈమె మాత్రమే కాదండోయ్ ఈ హీరోయిన్ తల్లి అక్క కూడా ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించినవారే. తల్లి 90వ దశకంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొనసాగింది. అప్పట్లో అగ్ర హీరోలు అందరితో కలిసి నటించి ఆడి పాడింది.
అయితే ఈ హీరోయిన్ అక్క పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ భారీ బ్యాగ్రౌండ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరోయిన్ మాత్రం ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది. అయితే ఇంత చెప్పినా కూడా అక్కడ ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టలేకపోతున్నారు కదా. ఆమె ఎవరో కాదు అలనాటి హీరోయిన్ అందాల తార రాధా రెండో కూతురు తులసి నాయర్. రాధా మొదటి కూతురు కార్తిక హీరోయిన్గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా తులసి నాయర్ జీవ హీరోగా వచ్చిన రంగం సినిమాతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. ఒకసారిగా పాపులర్ అయింది. నాగ చైతన్య జోష్ సినిమాలోను నటించింది. అయితే ఇటీవల కార్తీక తన అక్క పెళ్లిలో మెరిసిన ఫొటోస్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నిజంగా ఈమె తులసి నాయర్ రంగం 2 హీరోయిన్ అంటూ అవాక్కయ్ పోతున్నారు.