చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక మోత్వాని బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. ఆ తర్వాత తెలుగులో కేవలం 15 ఏళ్ల వయసులోనే అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాతో తెలుగు చిత్ర సీమ రంగంలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సౌత్ ఇండియా లో క్యాస్టింగ్ కౌచ్ రచ్చ కొనసాగుతున్న వేళ తనను ఓ తెలుగు హీరో డేటింగ్ కి రమ్మని ఫోర్స్ చేశారంటూ సంచలన విషయాన్ని బయట పెట్టింది. మరి ఇంతకీ హన్సికని పక్కలోకి రమ్మన్న ఆ తెలుగు హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.. హన్సిక మోత్వాని తెలుగులో దేశముదురు, కంత్రి, సీతారాముల కళ్యాణం లంకలో, తెనాలి రామకృష్ణ బిఏ బి ఎల్, పాండవులు పాండవులు తుమ్మెద,లక్కునోడు, కందిరీగ, పవర్, దేనికైనా రెడీ,ఓ మై ఫ్రెండ్, గౌతమ్ నంద వంటి సినిమాల్లో హీరోయిన్ గానే చేసింది. 

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మని ఓ తెలుగు హీరో సినిమా షూటింగ్ చేసే సమయంలో హన్సికని చాలా టార్చర్ చేశారట.డేట్ కి వస్తావా నాతో అంటూ చాలా ఇబ్బంది పెట్టాడట. అయితే ఆ తెలుగు హీరో చేసిన పనికి షూటింగ్ సెట్ లోనే గుణపాఠం చెప్పిందట హన్సిక మోత్వాని. ఇక ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పి నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అంటూ హన్సిక చెప్పడంతో ఇప్పటివరకు ఇంతమంది తెలుగు హీరోలతో నటించిన హన్సిక ని డేట్ కి రమ్మని టార్చర్ పెట్టిన ఆ టాలీవుడ్ హీరో ఎవరబ్బా అంటూ చాలామంది నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు.

ఇక హన్సిక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం హన్సిక కు సౌత్ లో ఎక్కువగా అవకాశాలు రావడం లేదు.. బాలీవుడ్లో చిన్నాచితక అవకాశాల్లో నటిస్తోంది. ఇక అవకాశాలు లేకపోవడంతో బుల్లితెర డ్యాన్స్ షో అయినటువంటి ఢీ కి జడ్జిగా వ్యవహరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: