ఇక ఇప్పుడు మూడో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనే విషయంపై కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్ లో సరికొత్త కాన్సెప్ట్ ని అమలు చేస్తున్నారు నిర్వాహకులు. ఒకప్పుడు వీక్ మొత్తానికి ఒక కెప్టెన్ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఏకంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరు కూడా గ్రూపులుగా విడదీసి ఆ గ్రూపులకి చీప్ అంటూ ఒక కెప్టెన్ నియమిస్తున్నారు. ఇక అతనే ఆ గ్రూప్ కి సంబంధించిన అన్ని వ్యవహారాలను అతనే చూసుకుంటూ ఉంటాడు ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రెండు టీమ్స్ ఉండగా ఒక టీం కి నిఖిల్ ఒక టీం కి అభయ్ ఇంకో టీం కి చీఫ్ గా కొనసాగుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.
అయితే అభయ్ చీఫ్ గా మారిన తర్వాత ఇక అతని టీం ఇప్పటివరకు ఆడిన అన్ని టాస్కులలో కూడా ఓడిపోతూ వచ్చింది. ఈ క్రమంలోనే అభయ్ నవీన్ ఓడిపోవడం ఇక తన పార్టిసిపేషన్ కూడా తక్కువగా ఉండడంతో.. అతనిపై వేటు వేయబోతున్నాడట బిగ్బాస్. ఈ క్రమంలోనే అభయ్ నవీన్ కి క్లాస్ పీకడంతో పాటు చీఫ్ పొజిషన్ నుంచి కూడా తీసేయబోతున్నారు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇలా అభయ్ నవీన్ పై వేటు వేసి చివరికి ఇక కొత్త చీఫ్ నియమించే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఏం జరగబోతుందో చూడాలి.