ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే.. అది దేవరనే. యావత్ ఇండియాను ఆల్రెడీ దేవర ఫీవర్ కమ్మేసింది. అసలు ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు.ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, మూడు పాటలు సినీ లవర్స్‌లో మాములు అంచనాలు క్రియేట్ చేయలేదు.నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న మూవీ 'దేవర'.దానికి తోడు ఆర్ఆర్ఆర్ వంటి అరివీర భయంకర హిట్టు తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ భారీగా అంచనాలు నెలకొన్నాయి.అయితే దేవరకు సంబంధించి మరో వార్త ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.ట్రిపుల్ ఆర్ లాగే దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువయ్యే విధంగా ఈసినిమా కు టైటిల్ పెట్టాలనుకున్నాం. అందుకే మా సినిమా కు దేవర అనే టైటిల్ ఫిక్స్ చేశాము. దేవర అంటే దేవుడు అని అర్థం ” అంటూ చెప్పుకొచ్చారు.ఇదిలావుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారని సమాచారం అందుతోంది. ఈ సినిమా విషయంలో తాను టెన్షన్ పడుతున్నానని తారక్ సైతం పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దేవర1 ఫీవర్ మాత్రం ప్రేక్షకుల్లో మామూలుగా లేదు. బుక్ మై షో యాప్ లో 4 లక్షలకు పైగా యూజర్లు ఈ సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇదిలావుండగా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 22న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.జాన్వికపూర్ తెలుగు డెబ్యూ అయిన ఈ సినిమా విజయం సాధించడం అందరికంటే దర్శకుడు కొరటాలకు చాలా కీలకం. అందుకే కొరటాల చాలా కష్టపడి "దేవర"ను తన కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా మలిచాడని వినికిడి. సైఫ్ అలీఖాన్ ను ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా అవుట్ పుట్ ఏ స్థాయిలో ఉందో తెలియాలంటే సెప్టెంబర్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: