టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తనను జానీ మాస్టర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ పోలీస్ స్టేషన్ మెట్టెక్కింది ఆయన దగ్గర వర్క్ చేసిన లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. అవుట్ డోర్ షూటింగ్ సమయంలోనే కాదు తన క్యార్ వాన్‌లో కూడా పలుమార్లు లైంగిక దాడి చేశాడని, ప్రతి ఘటించిన ప్రతిసారి మ్యాన్ హ్యాండిలింగ్ చేసేవాడని కంప్లయింట్‌లో పేర్కొంది. నార్సింగిలోని తన ఇంటికి వచ్చి అనేక సార్లు సెక్యువల్ హెర్రాస్ చేశాడంటూ తెలిపింది. మతం మార్చుకుని, తనను పెళ్లి చేసుకోమని బలవంత పెట్టారని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు.  జానీ మాస్టర్ మాత్రమే కాదు అతడి భార్య కూడా తనను కొట్టిందని తెలిపింది. దీంతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై రేప్‌తో సహా పలు కేసులు నమోదు చేశారు.జానీ ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లోని లడఖ్‌లో ఉన్నట్లు సమాచారం. అతడి కోసం స్పెషల్ టీమ్ లడఖ్‌ బయలుదేరినట్లు తెలుస్తోంది. అయితే, జానీమాస్టర్ పై చర్యలు తీసుకోవాలని బుధవారం మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదకు మహిళా సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న యువతిపై లైంగిక వేధింపుల ఘటనను తీవ్రమైన చర్యగా భావిస్తున్నామని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి తెలిపారు. ఆ యువతికి ఐదేళ్లపాటు నరకం చూపించడంతో పాటు వేధింపులు, దాడులకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇది లవ్ జిహాద్ కేసుగా ఆమె పేర్కొన్నారు.

హిందూ అమ్మాయిని ట్రాప్ చేసినట్లుగా స్పష్టంగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినప్పటికీ కేసును నీరుగార్చేందుకు నిందితుడిపై పనికిరాని కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. ఇంతవరకు జానీమాస్టర్ ను అరెస్టు చేయకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ ఘటనకు కొందరు సినీ ఇండస్ట్రీ పెద్దలతో పాటు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు.జానీ పై నాన్ బెయిలబుల్ కేస్ ఉందని చెబుతున్నారు. జానీ పై వివిధ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశామని.. మాపై ఎటువంటి ఒత్తిడి లేదన్నారు. ఇలాంటి కేసులలో పక్కా ఆధారాలు సేకరించాల్సి ఉంటుందని… పోక్సో చట్టం కూడా యాడ్ చేసామని వెల్లడించారు. పోక్సో కేసు కు ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉందని.. పోక్సో కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్ కు చిక్కులు తప్పవని అంటున్నారు. గత మూడు రోజులుగా జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. పోలీసుల నుండి తప్పించుకునేందుకు ఇతర రాష్ట్రాలకు పరారైయ్యారు జాని మాస్టర్.ఇదిలావుండగా పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేక అనుబంధం ఏర్పరచుకున్న జానీ మాస్టర్‌కు జనసేన పార్టీ.. ఏకంగా స్టార్‌ క్యాంపెయినర్‌ హోదాను కట్టబెట్టింది. అంతేకాకుండా, సినిమా ఇండస్ట్రీలో అత్యంత కీలకమైన కొరియోగ్రాఫర్స్‌ అసోషియేషన్‌కి అధ్యక్ష పదవి కూడా జానీ మాస్టర్‌‌కి దక్కింది. అలాంటి గౌరవప్రదమైన హోదాలు దక్కించుకున్న జానీ మాస్టర్‌ ఎంతో మంది స్టార్‌ హీరోలతో స్టెప్పులు వేయించాడు. అద్భుతమైన ప్రతిభ కలిగిన వ్యక్తి అనిపించుకుని, ఇటీవలే హీరోగానూ అవతారమెత్తాడు. ఇలాంటి సమయంలో యువతి చేసిన ఆరోపణలు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. జానీ మాస్టర్‌ను అతి త్వరలో అరెస్ట్‌ చేసే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: