సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్కువ శాతం చాలా సైలెంట్ గా ఉంటారు. ఎక్కువ కాంట్రవర్సీలు , ఇతర విషయాల జోలికి అస్సలు వెళ్ళరు. తన సినిమా షూటింగ్స్ ఏంటి , తన ఫ్యామిలీ ఏంటి అనే విషయాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటాడు. కొంత కాలం క్రితం మహేష్ బాబు , తారక్ హోస్ట్ గా వ్యవహరించిన షో కి గెస్ట్ గా వచ్చాడు. అందులో భాగంగా వీరిద్దరి మధ్య అనేక ఆసక్తికరమైన విషయాలు చర్చకు వచ్చాయి. ఆ చర్చలో భాగంగా తారక్... మహేష్ బాబు ను... అన్నా నువ్వు బాస్కెట్ బాల్ బాగా ఆడతావా అందుకే ఇంత హైట్ అయ్యావు అని నవ్వుతూ అడుగుతాడు. దానితో మహేష్ లేదు నేను బాస్కెట్ బాల్ ఆడను అని అంటాడు.

దానితో తారక్ ఏ ఆట ఎక్కువ ఆడతావు అన్న అని ప్రశ్నించగా నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం , క్రికెట్ నేను బాగా ఆడుతాను అని అంటాడు. దానితో తారక్ క్రికెట్లో నువ్వు ఎందులో బెస్ట్ అన్న.. బౌలర్ , బ్యాటరీ , ఆల్ రౌండర్ వా అని ప్రశ్నించగా ... నేను ఆల్ రౌండర్ ని అని మహేష్ సమాధానం ఇస్తాడు. దానితో తారక్ మనం అందరం కలిసి ఒక సారి క్రికెట్ ఆడాలి అన్న. మీ టీమ్ , మా టీమ్ ఎవరికి గెలుస్తారో చూడాలి అని నవ్వుతూ తారక్ అనగా... దానితో మహేష్ అవును కచ్చితంగా మనం ఎప్పుడైనా ఒక సారి ఒక మ్యాచ్ ఆడాలి అని అంటాడు.

ఇక ఆ తర్వాత తారక్ సరదాగా నీకు అసలైన ఆట మరికొన్ని రోజుల్లోనే మొదలు కానుంది. రాజమౌళి తో సినిమా చేస్తావు కదా అని అంటాడు. దానితో అర్థం కాలేదు అని మహేష్ అడగగా నీకే అర్థం అవుద్ది అన్న నేను ఎన్నో సినిమాలు ఆయనతో చేశాను ఎక్స్పీరియన్స్ తో చెబుతున్నాను. నీకు అసలు ఆట మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతోంది అంటాడు. ఇలా వీరిద్దరి మధ్య ఫన్నీగా మాటల వార్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: