ఈ క్రమంలోనే సిద్ధార్థ్, అదితి ఇల్లు గురించి ఓ టాక్ నడుస్తోంది. వీరు రిలేషన్లో ఉన్నపుడు నుండే చెన్నైలో ఇంటిని తమకు నచ్చినట్టు కట్టించుకున్నారని వినికిడి. ఇపుడు ఆ ఇంట్లోనే ఈ దంపతులు కాపురం ఉండబోతున్నారట మరి! సిద్ధార్థ్ చెన్నైలో జన్మించగా, అక్కడే సొంతంగా విలాసవంతమైన ఇళ్లు ఉంది. అలాగే హైదరాబాద్, ముంబైలోనూ కూడా ఈ హీరోకి ఇళ్లు ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా హీరోయిన్ అదితికి ముంబైలోని వెర్సోవాలో ఒక అద్భుతమైన లగ్జరీ అపార్ట్మెంట్ ఉందని తెలుస్తోంది. ఈ ఇంటికి సంబంధించిన ఫోటోస్ అదితి ఇన్ స్టాలో కూడా మనకు దర్శనం ఇస్తాయి. ఇక చిన్నతనంలో ఆమె తండ్రి ఆమె కోసం నిర్మించిన డాల్‌హౌస్ కూడా అదిరిపోతోంది. అదేవిధంగా అదితికి హైదరాబాద్‌లో కూడా పూర్వీకుల ఇల్లు ఒకటి ఉంది.
ఇంటి గురించి పక్కనబెడితే వీరిద్దరి కార్ కలెక్షన్ చూస్తే మతి పోతుంది. సినీరంగంలో ఎన్నో సవాళ్లను, కష్టాలను ఎదుర్కొని తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ జంట సంధించిన ఎక్కువ సంపాదనలో ఎక్కువశాతం కార్లు కొనుగోలుకే వెచ్చించినట్టు వినికిడి. ఇకపోతే, వీరిరువురు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా సిద్ధార్థ్ తెలుగుతోపాటు తమిళం, కన్నడ భాషలలోనూ తనకంటూ సెపరేట్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విషయం విదితమే. ఇక కార్ల విషయానికి వస్తే, అదితి,సిద్ధార్థ్ ఇద్దరూ లగ్జరీ వాహనాలకు పెద్ద అభిమానులని చెప్పుకోవచ్చు. అదితి దగ్గర ఆడి క్యూ7 (రూ. 1 కోటి), మెర్సిడెస్ - బెంజ్ GLS (రూ. 1.30 కోట్లు), bmw X7 (రూ. 1.30 కోట్లు) విలువైన కార్లుంటే... సిద్ధార్థ్ దగ్గర రోల్స్ రాయిస్, మెర్సిడెస్-బెంజ్, ఆడి A4 ఉన్నట్టు సమాచారం.