ఇండియన్ దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో ఇండియాలోనే నెంబర్ డైరెక్టర్ గా ఎదిగిన రాజమౌళి సినిమాల విషయంలో అస్సలు రాజీ పడడు. ఈ క్రమంలోనే కెరియర్లో ఇప్పటి వరకు ఒక్క ఫెయిల్యూర్ కూడా చూడని దర్శకుడిగా అరుదైన ఘనత రాజమౌళి దక్కించుకున్నారు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇదొక రేర్ ఫీట్. సినిమా సినిమాకి అతని రేంజ్ పెరిగిపోతూ ఉంది. కట్ చేస్తే, ఎవ్వరు అందుకోలేని హైట్స్ కి రాజమౌళి చేరిపోయారు. నెక్స్ట్ హాలీవుడ్ లెవల్ లో ఒక ఇండియన్ దర్శకుడిగా సక్సెస్ కొట్టడమే రాజమౌళి టార్గెట్ గా ఉంది. అయితే దానికి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సిద్ధమౌతోంది.

ఇక అలాంటి జక్కన్నతో సినిమా చేయాలని యావత్ ఇండియన్ సినిమా పరిశ్రమే కలలు కంటోంది. మరి తెలుగు పరిశ్రమకు సంబందించిన హీరోల గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇదిలా ఉంటే రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్స్ గా ఉన్న రామ్ చరణ్ (2), ఎన్టీఆర్(3), ప్రభాస్(3)తో సినిమాలు చేశాడు. అదేవిధంగా రవితేజ, నాని, నితిన్, సునీల్ లతో ఒక్కో మూవీ సూపర్ హిట్స్ అందుకున్నాడు. కానీ పాన్ ఇండియాగా పేరున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మాత్రం రాజమౌళి ఇప్పటి వరకు ఒక్క సినిమా అంటే ఒక్క సినిమా కూడా చేయలేదు. వారిద్దరూ సినిమా చేయబోతున్నారనే ప్రచారం కూడా రాలేదు. కానీ అల్లువారి అభిమానులు మాత్రం వారిద్దరి కాంబోకోసం కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురుచూస్తున్నారు.

కానీ వారి కాంబోలో సినిమా అంటే కష్టమే అనే గుసగుసలు టాలీవుడ్లో బాగా వినబడుతున్నాయి. అయితే దాని వెనక బలమైన కారణం లేకపోలేదు. అయితే ‘మగధీర’ అనే చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మించిన సంగతి విదితమే. అంత పెద్ద హిట్ తర్వాత అరవింద్ రాజమౌళి దర్శకత్వంలో అల్లు అర్జున్ తో మూవీ ప్లాన్ చేయకుండా ఉండడానికి కారణం అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ అనే రూమర్స్ బాగా వినబడుతున్నాయి. మగధీర సమయంలో అల్లు అరవింద్ జక్కన్నకి అసహనాన్ని కలిగించాడని టాక్. వాస్తవానికి ఈ సినిమాతోనే రాజమౌళి పాన్ ఇండియా స్థాయిని అందుకోవాల్సి ఉంది. కానీ ఆ సినిమాని మిగతా భాషల్లో డబ్ చేయమంటే దానికి అల్లు అరవింద్ ఒప్పుకొనేవాడు కాదని టాక్. అందుకే రాజమౌళికి కాస్త టైం పట్టింది. లేదంటే, తెలుగు సినిమా సత్తాని గ్లోబల్ వైజ్ ఆ సినిమాతోనే చూపించాల్సి ఉంది. ఆ కోపంతోనే ఇక ఆ కాంపౌండ్లోనే సినిమా చేయకూడదని రాజమౌళి డిసైడ్ అయ్యాడని టాక్?

మరింత సమాచారం తెలుసుకోండి: