ఎన్టీఆర్ 'దేవర' మూవీ ప్రీరిలీజ్ వేడుకకి రంగం సిద్ధం అయ్యింది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ లో తారక్ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలుగా జేజేలు అందుకుంటున్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. కానీ పాన్ ఇండియా హీరో అనే ట్యాగ్ ఆయనను మార్చేసినట్టుగా కన్పిస్తోంది.మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'దేవర'. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది.నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ సినిమాపై భారీ అంచనాలు పెంచగా.. హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య 'దేవర' సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇక రిలీజ్ సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచుతూ.. వరుస ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఇటీవల ట్రైలర్ ఈవెంట్‌లో 'దేవర' సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు ఎన్టీఆర్ తెలిపాడు.

ఇదిలావుండగా  ఈ సినిమా ప్రమోషన్లలో ఎన్టీఆర్ మాట్లాడుతూ తమిళ దర్శకుడు వెట్రిమారన్ తో సినిమా చేయాలనే ఇంట్రెస్ట్ ను చూపించారు తారక్. అది మాట వరసకే అన్నాడు అనుకున్నా కూడా ఎన్టీఆర్ లైనప్ చూస్తే షాక్ తప్పదు.పాన్ ఇండియా హీరో కావడానికి రాజమౌళి లాంటి తెలుగు దర్శకులను నమ్ముకున్న ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం కన్నడ, హిందీ, తమిళ దర్శకులతో కలిసి పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండడం గమనార్హం. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర తర్వాత, ఎన్టీఆర్ బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 లో కనిపించనున్నాడు. ఆ తర్వాత కన్నడ సినిమాకు చెందిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల ఎన్టీఆర్ కూడా తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తిని వ్యక్తం చేశాడు, అది త్వరలో కార్యరూపం దాల్చవచ్చు. ఈ సినిమాలు విజయం సాధిస్తే పాన్-ఇండియా అగ్ర నటుడిగా ఎన్టీఆర్ స్థానం సుస్థిరంగా స్థిరపడుతుంది. కానీ అది ఆయనను తెలుగు దర్శకులకు దూరం చేస్తుంది అనేది నిజం.మొత్తానికి తమిళ ఇంటర్వ్యూల్లో తారక్ తన ఫేవరెట్ తమిళ దర్శకుల జాబితాను బయటపెట్టాడు. వేట్రి మారన్- అట్లీ కుమార్- లోకేష్ కనగరాజ్ - నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో అతడు నటించేందుకు ఆస్కారం ఉంది. వేట్రి మారన్, అట్లీ, లోకేష్ లకు అత్యధిక ప్రాధాన్యత ఉందని అర్థమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: