ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, ఓ విషయంలో చిన్నబోతున్నారని టాక్ నడుస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే... విడుదలకు ఇంకా వారం రోజులే ఉన్నప్పటికీ, సినిమా ప్రమోషన్స్ విషయంలో ఎందుకనో చిత్ర యూనిట్ కాస్త నెమ్మదిగా ఉంది. రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుందని కలలుగన్న ఎన్టీఆర్ అభిమానులకు అడియాసే మిగిలింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అటువంటి ఫంక్షన్లో జరపడం తగ్గిపోయింది. ఇక దేవర సినిమాకి ప్రమోషన్ ఫంక్షన్ ఉంటుందని భావించిన ఫ్యాన్స్ ఫ్యాన్స్ కి చుక్క ఎదురయింది. దాంతో తీవ్ర అసహనం లో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే విషయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేయాలని కోరుకుంటున్నారు.
ఇక వారి బాధ ఏమిటంటే... జూనియర్ ఎన్టీఆర్ సోలో సినిమా చూసి దాదాపు 5 సంవత్సరాలు కావస్తోంది. మునుపు జక్కన్న ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చినప్పటికీ... ఆ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర తక్కువ చేశారని అభిమానులు ఫీల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటినుండి అసంతృప్తిగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు... దేవర సినిమా వారికి ఆనందాన్ని కలిగిస్తుందని కలలు కంటున్నారు. మరి సినిమా విడుదల తర్వాత వారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడానికి ఇంకా వారం రోజులు గడువు ఉంది. ఇకపోతే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్స్ సినిమా పైన అంచనాలు పెంచుతున్నప్పటికీ... కొంతమంది విశ్లేషకులు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఇక ఆయా ప్రచార చిత్రాలు, ట్రైలర్స్ ఎలా ఉన్నాయో కిందన కామెంట్స్ రూపంలో తెలియజేయండి.