ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆలియా భట్ తన కెరీర్ ప్రారంభంలో తాను ఎదురుకున్న కొన్ని అవమానాల గురించి తెలియజేసింది.. సాధారణంగా తాను కాస్త బొద్దుగా ఉన్నానని తన లుక్స్ విషయంలో ఎప్పుడు ఇబ్బంది పడలేదు, బాధపడలేదు.. కానీ సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత తాను చాలా మారిపోవాల్సి వచ్చిందని తెలిపింది.. ముఖ్యంగా తన శరీరాకృతి విషయంలో కూడా చాలా అవమానాలు ఎదుర్కొన్నానని.. బరువు తగ్గడం కోసం చాలా కష్టపడ్డానని తెలిపింది ఆలియా భట్. తను పడిన కష్టాన్ని చూసి స్నేహితులు కూడా విసిగిపోయి ఇక ఈ డైటింగ్ ఆపేసి ప్రశాంతంగా ఉండు అంటూ స్నేహితులు సలహా ఇచ్చారట.
కానీ అవన్నీ లెక్కచేయకుండా తన బరువుని తాను కంట్రోల్ చేసుకోవాలని నిర్ణయించుకున్నానని అలా ఇప్పటికీ కూడా కష్టపడుతూ ఉన్నానని..మళ్లీ ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో తన శరీరాకృతి విషయంలో తన భావాలు కూడా పూర్తిగా భారిపోయాయని తెలిపింది. అలాగే ఐశ్వర్యరాయ్, రేఖా, షారుక్ ఖాన్ గురించి మాట్లాడుతూ ఈ నటులే తనకు చాలా స్ఫూర్తి అంటూ వెల్లడించింది. రేఖ వంటి వారిని ఎవరు రీప్లేస్ చేయలేరు.. ఆమె అందరిని బాగానే ఆకట్టుకుంది. డాన్స్ విషయంలో కూడా ఐశ్వర్య రాయ్ కి మంచి పేరు ఉంది అంటూ తెలిపింది. షారుక్ ఖాన్ పడి లేచిన కెరటం అర్థం తెలిపింది ఆలియా భట్.