సమంత ఆరోగ్యం కోసం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే కోలుకొని మళ్ళీ సినిమాలు, సిరీస్ లు మొదలుపెడుతుంది. ఒక సంవత్సరం నుంచి సమంత తన హెల్త్ కోసం, అందం కోసం రకరకాల చికిత్సలు తీసుకుంటుంది. రెగ్యులర్ గా తన సోషల్ మీడియాలో ఆరోగ్యం గురించి పోస్టులు కూడా చేస్తుంది.  ఏ మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యింది సమంత. ఆ తర్వాత తక్కువ సమయంలోనే ఈ చిన్నది స్టార్‌గా మారిపోయింది. దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ్ భాషల్లో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ

 చిన్నది. సమంత, నాగ చైతన్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఇక విడిపోయిన తర్వాత సమంత, నాగ చైతన్య ఎవరి లైఫ్‌లో వారు బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే సమంత మాయోసైటిస్ కారణంగా ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంది. ఇక ఇప్పుడు తిరిగి సినిమాల్లో నటించడానికి రెడీ అవుతుంది.  సమంత హిందీలో ప్రముఖ ఓటిటి మరియు సినీ నిర్మాణ సంస్థ నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న "రక్త్ బ్రహ్మాండ్" అనే వెబ్ సీరీస్ లో నటిస్తున్నట్లుప్రకటించింది. ఈ వెబ్ సీరీస్ లో బాలీవుడ్ నటి వామికా గబ్బి, మిర్జాపూర్ ఫేమ్ అలీ ఫజల్, ఆదిత్య రాయ్ కపూర్, తదితరులు ప్రధాన

 తారాగణంగా నటిస్తున్నారు. ఈ వెబ్ సీరీస్ 6 ఎపిసోడ్లు ఉండనున్నట్లు సమాచారం. కాగా ఈ వెబ్ సీరీస్ ని హిందీలో తుంబాడ్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన రాహీ అనిల్ బ్రేవ్ మరియు రాజ్ & డీకే తదితరులు కలసి డైరెక్ట్ చేస్తున్నారు. అయితే నటి సమంత ఆమధ్య హిందీలో పాపులర్ అయిన ఫ్యామిలి మ్యాన్ రెండవ సీజన్ లో నటించింది. ఈ పాత్ర కొంచెం బోల్డ్ గా ఉండటంతో సమంత అభిమానులు పెద్దగా ఇష్టపడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: