టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ స్టార్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. ప్రస్తుతం హై డిమాండ్ ఉన్న హీరోయిన్లలో శ్రీలీల టాప్ లో దూసుకుపోతుంది. టాలీవుడ్ లో ఉన్న టాప్ స్టార్స్ కి, మీడియం రేంజ్ స్టార్ హీరోలకు క్రేజ్ ఉన్న హీరోయిన్ల పరంగా శ్రీ లీల ఫస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. పెళ్లి సందడి అనే చిన్న సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ, వెంటనే ధమాకా తో బ్లాక్ బస్టర్ కొట్టగా రీసెంట్ గా గుంటూరు కారంతో మరో విజయం అందుకుంది. అయితే మధ్యలో పలు సినిమాలు ప్లాప్ అయినా, శ్రీ లీల కి వచ్చిన డోకా ఏమి లేదు. ఇక శ్రీ లీల ప్రస్తుతం తెలుగు సినిమాలతోనే బిజీగా ఉండగా, రీసెంట్ గా ఓ తమిళ స్టార్

 సినిమాని శ్రీ లీల రిజెక్ట్ చేసి మంచిపని చేసిందని నెట్టింట కామెంట్స్ వినిపించాయి. మరోవైపు సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉండే ఆమె.. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన చిట్ చాట్‌లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇచ్చింది. 'ఇప్పటివరకూ మీరు నటించిన చిత్రాల్లో మీకు ఎక్కువ ఇష్టమైన పాత్ర ఏది' అని ఓ ఫాలోవర్ అడిగిన ప్రశ్నకు.. ఓ ఫొటోతో సమాధానమిచ్చింది శ్రీలీల. ముఖంపై గాటుతో ఆమె కనిపిస్తున్న ఆ ఫొటో 'భగవంత్ కేసరి' సినిమాలోది. బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల పోషించిన విజ్జి పాత్రకు చక్కని ప్రశంసలు దక్కాయి. అందుకే హీరోయిన్‌గా హిట్ అందుకున్న

 సినిమాలను పక్కనబెట్టి.. 'భగవంత్ కేసరి'లోని క్యారెక్టర్ తన ఆల్ టైమ్ ఫేవరేట్ అని చెప్పింది శ్రీలీల. ప్రస్తుతం తెలుగులో నితిన్, రవితేజ సినిమాల్లో నటిస్తున్న ఆమె కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ అవకాశాలు అందుకునే ప్రయత్నంలో ఉంది. ఇకపోతే   సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందd సినిమాతో శ్రీలీల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ సినిమాలో హీరోగా పరిచియం అయ్యాడు. పెళ్లి సందd సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తర్వాత శ్రీలీల హీరో రవితేజ, మహేష్ బాబు, రామ్, బాలకృష్ణ, నితిన్ వంటి హీరోల సినిమాల్లో నటించింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: