ఈ విషయం పైన మీ స్పందన ఏంటి అంటూ యాంకర్ ప్రశ్నించగా.. ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదంటూ క్లారిటీ చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. రిషబ్ పంత్ తో ఎఫైర్ కేవలం రూమర్స్ మాత్రమే అని ఇవి తన జీవితం మీద కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయంటూ తెలిపింది..RP అనే పదం ఉపయోగించడం వల్లే కేవలం రిషబ్ పంత్ తోనే తనకు లింక్ చేసి ఎప్పుడు వార్తలు రాస్తూ ఉన్నారని మిమ్స్,రూమర్స్ కూడా సృష్టిస్తూ ఉన్నారంటూ తెలిపింది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను తానే పర్సనల్గా ఉంచాలని భావిస్తాను కేవలం తన పని,కెరియర్ మీద మాత్రమే ప్రస్తుతం దృష్టి పెడుతున్నాను అంటూ తెలిపింది.
క్రికెటర్ రిషబ్ పంత్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా క్లారిటీ ఇచ్చేసింది. అలాగే ఇలాంటి విషయాలలో రూమర్స్ నమ్మడం కంటే నిజం పైన దృష్టి పెట్టండి అంటూ తెలియజేసింది. ఇలాంటి తప్పుడు రూమర్స్ వల్ల తన వ్యక్తిగత జీవితం కూడా చాలా కష్టంగా మారిపోయిందని వీటిని ఎదుర్కోవడానికి చాలా కష్టపడుతున్నానంటూ తెలిపింది ఊర్వశి రౌతేలా.2022 లో RP తనను చాలా గంటలు వేచి ఉండేలా చేశారంటూ పోస్ట్ పెట్టడం ద్వారా అప్పటినుంచి వీరి మధ్య ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు ఎట్టకేలకు వీటికి చెక్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ.