మంచి కాన్సెప్ట్ కథలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్న హీరో సుహాస్. కలర్ ఫోటో చిత్రంతో హీరోగా తన ప్రస్థానం మొదలు పెట్టాడు. వరుసగా రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న విధానం లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ కథలతో తెలుగు ప్రేక్షకులను అలరించి బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుకున్నాడు. ఇదిలా ఉంటే సుహాస్ తాజాగా నటించిన సినిమా గొర్రె పురాణం అయితే ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్ 20న విడుదల చేస్తాము అని ప్రకటించారు. కానీ ఊహించిన విధంగా ఈ సినిమాను రేపటికి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఇలా వాయిదా పడడానికి అసలు కారణం

 సుహాస్ అని తెలుస్తోంది. నటుడు సుహాస్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు కానీ అతను ఈ సినిమా ప్రమోషన్‌కు దూరంగా ఉన్నాడు. మేకర్స్ అతనిని కోరినప్పటికీ, సుహాస్ గొర్రె పురాణం ట్రైలర్ లాంచ్‌కు హాజరు కాలేదు. సుహాస్ ఈ చిత్రానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో చిత్రబృందం ప్రమోషనల్ ప్లాన్‌లను కూడా రద్దు చేసింది.  ఇది కాకుండా, సుహాస్ తన రాబోయే చిత్రం జనక అయితే గనక అక్టోబర్‌లో విడుదలవుతున్నందున ఈ సినిమా విడుదలను నవంబర్‌కు వాయిదా వేయాలని గొర్రె పురాణం బృందాన్ని ప్రెజర్ చేస్తున్నాడని అంటున్నారు. గొర్రె పురాణం రిజల్ట్ సంగతి పక్కన పెడితే అసలు ఇప్పటివరకు

 సుహాస్ సినిమాకి సపోర్ట్ చేసిందే లేదని అంటున్నారు. సుహాస్ వచ్చింది కూడా యూట్యూబ్ బ్యాగ్రౌండ్ నుంచే చిన్న సినిమాలుకు సపోర్ట్ చేయకుండా తాను చేస్తున్న మరో సినిమా కోసం ఈ సినిమాని వాయిదా వేయమని కోరడం కరెక్ట్ కాదు అనే వాదన వినిపిస్తోంది. గొర్రె పురాణం డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడుకున్నదని ట్రైలర్ తో కొత్త క్లారిటీ ఉంది. అయితే ఎలాంటి ఆప్షన్స్ లేకపోవడంతో గొర్రె పురాణం మేకర్స్ ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మరి ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా విడుదలవుతున్న ఈ సినిమా ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: