దీంతో జూనియర్ ఎన్టీఆర్ సినిమా పైన రేవంత్ రెడ్డికి అపారమైన ప్రేమ చూపించారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి అగ్ర హీరోల సినిమాలకు ప్రీమియర్ షోలు ప్రదర్శించడం ఎన్నో ఏళ్లగా వస్తోంది.మొదటివారం టికెట్ల ధరల పెంపు విషయం పైన కూడా ప్రభుత్వం వెలుసుబాటు చేసుకొనే సదుపాయాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఈ విషయం పైన ఏ విధమైనటువంటి క్లారిటీ మాత్రం రాలేదు.
తెలంగాణలో మాత్రం దేవర చిత్రానికి స్పెషల్ షోలు వేసుకోవడమే కాకుండా టికెట్లు ధరలు పెంపునకు కూడా అనుమతి కోరగా అందుకు సానుకూలంగానే స్పందన వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి జీవో కూడా రిలీజ్ చేయబోతున్నారట. అర్ధరాత్రి ఒంటిగంట షో కి అనుమతి ఇవ్వడంతో పాటు ప్రతిరోజు కూడా 6 ఆటలు వేసుకునేలా 15 రోజులపాటు ప్రదర్శించుకుని వెలుసుబాటు కూడా తెలంగాణ ప్రభుత్వం దేవర సినిమాకి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లో రూ .50 రూపాయలు మల్టీప్లెక్స్ థియేటర్లో రూ .100 రూపాయలు పెంచుకొని వెలుసు పాటు కూడా అందించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా రాబోతోందట.