ఆ తరువాత వరుస ఆఫర్లు అందుకుని పలు హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ స్టార్ బ్యూటీ కెరియర్ పిక్స్ లో ఉండగానే రణబీర్ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ తరువాత కొద్ది కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ బ్యూటీగా రాణిస్తోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆలియా భట్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. " గతంలో నేను కాస్త బొద్దుగా ఉండే దాన్ని. నా లుక్స్ విషయంలో ఎప్పుడూ బాధపడలేదు.
కానీ ఇండస్ట్రీకి అడుగు పెట్టాక ఎంతో మారాల్సి వచ్చింది. శరీరాకృతి విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. బరువు తగ్గడానికి తీవ్రంగా శ్రమించాను. దీంతో నన్ను చూసి నా స్నేహితులు డైట్ ఆపేయ్ నీకు నచ్చిన ఆహారం తింటూ ప్రశాంతంగా ఉండు అని అన్నారు. అయినప్పటికీ నేను వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. ఏది ఏమైనా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాను. ఈ మేరకు కష్టపడుతూనే ఉన్నాను. అయితే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు శరీరాకృతి విషయంలో నా ఆలోచన పూర్తిగా మారింది. అప్పుడు నా లుక్స్ ను చూసుకుని నన్ను నేను ఎప్పటికీ విమర్శించుకోకూడదని తెలుసుకున్నాను" అని చెప్పుకొచ్చింది.