ప్రస్తుత తెలుగు సినిమా  గ్లోబల్ స్థాయిలో తన సత్తా చాటుతోంది.ప్రపంచంలోనే దిగ్గజ నటులు తెలుగు సినిమాలో నటించేందుకు సిద్ధంగా వున్నారు.. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమాలే గుర్తొచ్చేవి.. తెలుగు సినిమా కేవలం ప్రాంతీయ సినిమాగానే గుర్తించ బడింది కానీ ఇప్పుడు సీన్ మారింది.. తెలుగు సినిమా రేంజ్ పెరిగింది. ఇండియన్ సినిమా అంటే మొదట గుర్తొచ్చే ఇండస్ట్రీ గా టాలీవుడ్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే రూ. వందల కోట్లను వసూలు చేస్తోంది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయి పెరిగింది.. హాలీవుడ్ దిగ్గజ దర్శకులు సైతం తెలుగు సినిమా ఖ్యాతిని మెచ్చుకున్నారు.. అయితే అప్పటి బాహుబలి నుంచి ప్రస్తుత దేవర వరకు ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సత్తా చాటిన టాప్ 10 తెలుగు సినిమాల వివరాలు ఇలా వున్నాయి..

ఆర్ఆర్ఆర్

బాహుబలి తరువాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బిగ్గెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ మూవీ .. టాలీవుడ్‌కు ఆస్కార్ అవార్డ్‌ను తెచ్చిపెట్టింది. ఆర్ఆర్ఆర్ డిజిటల్, శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ కోసం విపరీతమైన పోటీ నెలకొనగా.. దాదాపు రూ.480 కోట్ల వ్యాపారం జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రూ.191 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా. ఇప్పటి వరకు తెలుగు సినిమాలలో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది


కల్కి 2898AD

మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ నటించిన కల్కి 2898 ఏడీ సరికొత్త రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కింద ఏకంగా రూ. 385 కోట్ల వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం . తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఏకంగా రూ.180 కోట్లు, ఓవర్సీస్‌లో 70 కోట్లు, హిందీలో రూ.85 కోట్ల వ్యాపారం చేసినట్లు తెలుస్తుంది.


బాహుబలి 2

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం బాహుబలి 2. ప్రభాస్, అనుష్క, రానా కీలకపాత్రలు పోషించిన బాహుబలికి ఈ సినిమా సీక్వెల్‌గా తెరకెక్కింది.అప్పట్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కింద దాదాపు రూ.350 కోట్ల వ్యాపారం జరిగినట్లు సమాచారం.. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా ఏకంగా రూ.190 కోట్లకు అమ్ముడుపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.


సలార్

కేజీఎఫ్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ సలార్.. ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది..

సాహో

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో సాహోపై ఊహించని అంచనాలు నెలకొన్నాయి. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో అదరగొట్టింది.. సాహో సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కింద ఏకంగా రూ.333 కోట్ల వ్యాపారం జరిగినట్లు సమాచారం.


ఆదిపురుష్

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. బాహుబలి విపరీతం అయిన క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ఈ సినిమాలో రాముడిగా నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.అందుకు తగినట్లుగానే ఈ సినిమా బిజినెస్ జరిగింది. ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఈ సినిమా రూ.250 కోట్లకు పైగా వ్యాపారం చేసింది.


రాధేశ్యామ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన క్యూట్ లవ్ స్టోరీ రాధేశ్యామ్..ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది...ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా రూ.107 కోట్ల వ్యాపారం చేసి ప్రభాస్ రేంజ్ ఏంటో నిరూపించింది.


దేవర

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తోంది.ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కింద రూ. 180 కోట్ల వ్యాపారం జరిగింది.


పుష్ప

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పక్కా మాస్ మూవీ పుష్ప ది రైజ్‌ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఏకంగా ఐదు భాషల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్, శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ రైట్స్ ఇలా అన్ని కలుపుకొని దాదాపు రూ.160 కోట్ల వ్యాపారం జరిగినట్లు సమాచారం.


సైరా నరసింహారెడ్డి

మెగాస్టార్ చిరంజీవి నటించిన పీరియాడిక్ మూవీ సైరా నరసింహారెడ్డి. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో రికార్డు  సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా రూ.208 కోట్ల వ్యాపారం చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా ఏకంగా రూ.108 కోట్ల బిజినెస్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: