ఈ నేపథ్యంలో ఈయనకు సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్‌గా మారుతుంది.ఓ విషయంలో పెద్ద కుట్ర జరుగుతుందని.. త్రివిక్రమ్ శత్రువులంతా ఒకటై పోయారంటూ వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఏంటి త్రివిక్రమ్ కు శత్రువులా..? స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన అందరితో కలివిడిగా, సరదాగా ఉండే మనిషికి విరోధులు ఏంటి..? అనుకుంటున్నారా.. ఓ మనిషి ఎదిగాడంటే ఆటోమేటిక్‌గా శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు.
అయితే త్రివిక్రమ్ విషయంలో ఆయన అంటే గిట్టని వాళ్లు కూడా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అతను పడిపోతే చూడాలని ఎంతగానో కోరుకుంటున్న వాళ్లంతా ఇప్పుడు ఒకటైనట్లు తెలుస్తుంది. కొంతమంది నిర్మాతలు, కొంతమంది హీరోలు, ఓ మ్యూజిక్ డైరెక్టర్ కొద్దిరోజులుగా త్రివిక్రమ్ పై కోపంతో ఉన్నారని.. ఇప్పుడు వాళ్లంతా పూనం కౌర్ వాదనతో ఒకటై త్రివిక్రమ్ విషయంలో భారీగా కుట్ర చేస్తున్నట్లు తెలుస్తుంది. న్యాయం గెలవాలి టాలీవుడ్ శుభ్రంగా ఉండాలంటూ స్టేట్మెంట్స్ ఇస్తూనే.. మరోవైపు ఈ వాదనని మరింతగా ఎగదోసే ప్రయత్నం చేస్తున్నారట. ఎప్పుడైతే త్రివిక్రమ్ నేరుగా పూనం కౌర్ పేరు ప్రస్తావిస్తూ.. ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఆరోపణలు చేసిందో అప్పటినుంచి కొంతమంది ఆమెను కలవడం మొదలుపెట్టారట.కోర్ట్‌లో కేసు వేయమని.. పోలీస్ స్టేషన్‌కు వెళ్ళమని.. ఏం జరిగినా తాము భరోసాగా ఉంటామని.. హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక మరి కొంతమంది అయితే ఏకంగా మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు మాకు ఇస్తే మొత్తం మేము చూసుకుంటాం. పెద్దలతో కలిసి కేసును ముందుకు తీసుకెళ్తామని అడిగినట్లు సమాచారం. ఇక ఈ వ్యవహారంలో త్రివిక్రమ్ తరఫునుంచి కూడా కొంతమంది ముందుకు వచ్చి ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేయాలి.. మధ్య మార్గంగా రాజీపడే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా.. ఏం కావాలో కోరుకోమని.. ఆఫర్లు ఇస్తున్నారట. మొత్తానికి పూనం కౌర్ వ్యవహారంలో తెరపై కనిపించేది కాస్తంత అయినా.. తెర వెనక ఎంతో పెద్ద వ్యవహారమే నడుస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక ఈ వివాదంలో ఒక్కసారిగా త్రివిక్రమ్‌పై కోపంగా ఉన్న వాళ్లంతా ఏకమై మరి పనిచేస్తున్నారు.