అలనాటి నటి రాశి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు తన హవా కొనసాగించింది. ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు చేయకుండా కేవలం తన నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ బ్యూటీ ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. గోకులంలో సీత, ప్రేయసి రావే, పెళ్లి పందిరి, శుభాకాంక్షలు వంటి సినిమాలు హీరోయిన్ రాశికి మంచి పేరును తెచ్చిపెట్టాయి.


గోకులంలో సీత సినిమాలో పవన్ కళ్యాణ్ తో ఈ బ్యూటీ పోటీపడి మరి నటించింది. ఈ సినిమాని అభిమానులు అస్సలు మర్చిపోలేరు. ముఖ్యంగా శుభాకాంక్షలు సినిమాలో రాశి మంచి క్యారెక్టర్ లో నటించింది. ప్రేయసి రావే సినిమాలో శ్రీకాంత్ ను డామినేట్ చేస్తూ అద్భుతంగా నటించింది. ఇక వయసు పెరిగే కొద్దీ రాశికి సినిమా అవకాశాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించి మెప్పించింది. అనంతరం సినిమాలకు కాస్త దూరం అయింది.


ప్రస్తుతం రాశి కేవలం టీవీ సీరియల్స్ లో నటిస్తూ తన కెరీర్ ను కొనసాగిస్తోంది. రాశీ నటించిన సీరియల్లకు రికార్డు స్థాయిలో రేటింగ్స్ రావడంతో రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటుందని అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాల ద్వారా ఈ బ్యూటీ భారీగానే డబ్బులను సంపాదించిందట. ప్రస్తుతం రాశి వయసు 42 సంవత్సరాలు. కేవలం 5000 రూపాయల పారితోషకంతో తన కెరీర్ ను మొదలుపెట్టిన రాశి భారీగా ఆస్తులను కూడబెట్టిందట.


 ప్రస్తుతం రాశి ఆస్తి విలువ 20 కోట్లు వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది ఇలా ఉండగా అలనాటి హీరోయిన్ రాసి అలాగే శ్రీకాంత్ మధ్య అప్పట్లో... రిలేషన్ ఉందని.. కొంతమంది ప్రచారం చేశారు. వీరిద్దరి మధ్య రహస్య సంబంధం ఉందని కూడా.. వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ప్రతిసారి రాసి అలాగే శ్రీకాంత్ కొట్టి వేస్తూ వస్తున్నారు. ఇప్పటికి కూడా వీరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని కొంతమంది అంటారు. ఇందులో మాత్రం వాస్తవం లేదని ఇండస్ట్రీ ప్రముఖులు కూడా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: