గతంలో నేను ఈజాజ్ అనే వ్యక్తి తో రిలేషన్‌లో ఉన్నాను. మా ప్రేమవిషయం అమ్మకు తెలిసి నిరుత్సాహపడింది. మా ఇద్దరి మతాలు వేరు కావడంతో ఎప్పుడూ నా గురించి కంగారుపడుతూ ఉండేది. అయినా సరే తన భయాల్ని, అభిప్రాయాలను నేను పట్టించుకోలేదు. నిజానికి మేమిద్దరం ఎవరికి వారు బాగానే ఉన్నాం. కానీ కలిసి ఉన్నప్పుడే మా బంధం వర్కవుట్ కాలేదు.
ఏ రిలేషన్‌లో అయినా మనల్ని వారికి నచ్చినట్లుగా మార్చుకోవాలనుకుంటే అది ప్రేమ అనిపించుకోదు. తను నన్ను మార్చాలని చూసినప్పుడు నాకసలు అర్థం కాలేదు. ఎందుకంటే నేను పీకల్లోతు ప్రేమలో కూరుకునిపోయాను. కానీ ఒకరి గురించి నేను మారలేను. నేను నాలాగే ఉండాలనుకున్నాను. దీంతో బంధం కొనసాగలేదు.విడిపోయినప్పుడు ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఏడాదికి పైనే పట్టింది. ఇంట్లో ఉండలేక బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లిపోయాను. తనే రోజూ నన్ను ప్రేమగా నిద్ర లేపేది. అందుకే నేనిచ్చే సలహా ఏంటంటే.. ఎవరి కోసమో మనం మారనక్కర్లేదు. మనల్ని మనలాగే స్వీకరించాలి. అలాగే మీ పార్ట్‌నర్ ఫోన్‌పై ఓ కన్నేసి ఉంచండి. వారు ఫోన్ దాస్తూ, చేతికి ఇవ్వడానికి భయపడుతున్నారంటే ఏదో తప్పు జరుగుతున్నట్లే లెక్క.కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉంచుతున్నాడంటే కూడా తను మనకు కరెక్ట్ పర్సన్ కాదని తెలుసుకోండి అని సూచనలు ఇచ్చింది. కాగా అనిత, ఇజాజ్.. కావ్యాంజలి సీరియల్‌లో కలిసి నటించారు. కొన్నాళ్లపాటు డేటింగ్ చేసిన ఈ జంట 2007లో విడిపోయింది. తర్వాత అనిత 2013లో రోహిత్ రెడ్డిని పెళ్లాడింది. వీరికి 2021లో ఆరవ్ అనే బాబు జన్మించాడు.ఇక పెళ్ళై.. తల్లిగా మారడంతో నటనకు దూరంగా ఉన్న అనితా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఫ్యామిలీతో గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను గట్టిగానే సంపాదించుకుంది. ఇన్ స్టాలో బ్రాండ్స్ వీడియోలను షేర్ చేస్తూ ప్రమోటర్ కూడా ఆదాయం దక్కించుకుంటుంది.