* సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూ

* సడన్ గా బాంబ్ పేలుస్తున్న భాధితులు

* మహిళకు సమానత్వమే కాదు రక్షణ కూడా కావాలంటూ నిరసనలు..


ప్రస్తుత సమాజంలో స్త్రీపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి.చిన్న లేదు పెద్ద లేదు ఆడది అయితే చాలు వేధించి నరకం చూపిస్తున్నారు..భారతదేశంలో స్త్రీనీ దేవతలా పూజిస్తారు.. అలాంటి స్త్రీకి పురుషునితో పాటు సమానంగా హక్కులు కల్పించిన కూడా ఇంకా పురుషాధిక్యం స్త్రీలపై వుంది.. ప్రతి రంగంలో కూడా స్త్రీ కి వేధింపులు తప్పడం లేదు.. ఇంక సినీ ఇండస్ట్రీ గురించి చెప్పనవసరం లేదు.. సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలి అని ఓపెన్ గా అడుగుతుంతారు.. అలాంటి వారందరిని ఎదిరించి వారిపై పోరాడి తమ టాలెంట్ నిరూపించుకున్న వాళ్ళు కొందరైతే మిగిలిన వారు చేసేదేమి లేక వారి వికృత చేష్టలకు లొంగిపోతున్నారు.. అయితే టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో హీరోయిన్స్ పై ఇలాంటి వేధింపులు జరుగుతూనే వున్నాయి.. కానీ ఎవరూ కూడా నటి శ్రీ రెడ్డి రేంజ్ లో బయటకి వచ్చి నిరసన తెలపలేదు.. గతంలో టాలీవుడ్ లో శ్రీ రెడ్డి ఇష్యూ ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..నటి శ్రీరెడ్డి  తనని చాలా మంది సినీ ప్రముఖులు అవకాశాల పేరుతో లైంగిక వేధింపులకు గురిచేశారని సంచలన వ్యాఖ్యలు చేసింది.


తెలంగాణ ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు తీసుకోకుంటే ఆమరణ దీక్ష చేస్తానని.. అప్పటికీ దిగిరాకుంటే నగ్నంగా ఫిలిం నగర్‌లో నిలబడి నిరసన తెలుపుతానని అప్పట్లో శ్రీ రెడ్డి మీడియా ముందు బహిరంగంగా హెచ్చరించింది.అయితే శ్రీ రెడ్డి అన్నట్లుగానే ఫిలింనగర్‌లో  అర్థనగ్నంగా నిలబడి నిరసన తెలియజేసింది.  శ్రీరెడ్డి హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌కు వెళ్లి, చుడీదార్ ధరించిన వస్త్రాలను పూర్తిగా తొలగించి..పొట్టి బట్టలతో తన నిరసన తెలిపింది. తర్వాత టాప్ తీసేసి.. కేవలం షార్ట్ తో రోడ్డుపై అందరూ చూస్తుండగా కూర్చుని మీడియాకు ఇంటర్వ్యూ  ఇచ్చింది.'నాకు అన్యాయం జరుగుతోంది. మూవీ ఆర్టిస్ అసోషియేషన్‌లో నాకు సభ్యత్వం ఇవ్వడం లేదు. నాకు వారు అన్యాయం చేస్తున్నారు. నా ఆవేదనను  వారు అస్సలు పట్టించుకోవడం లేదు.అందుకే ఈ అర్ధనగ్న ప్రదర్శన చేశాను అని  శ్రీరెడ్డి మీడియాకు తెలిపింది.



 ఈ ఇష్యూ పెద్దది అవటంతో వెంటనే అప్రమత్తమైన ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు ఆమెతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించినప్పటికీ శ్రీరెడ్డి ససేమిరా అనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇష్యూ నీ క్లియర్ చేసారు.. అయితే అంతటితో ఆగని శ్రీ రెడ్డి మీడియాలో కొందరి సినీ ప్రముఖుల పేర్లు బయటపెట్టి వారు ఎలాంటి ఆకృత్యాలు చేసారో కూడా వివరించింది.. వారిలో స్టార్ డైరెక్టర్ లు, స్టార్ హీరోలు కూడా ఉన్నట్లు ఆమె తెలిపింది.. ఆ ఘటన తరువాత శ్రీ రెడ్డికి మంచి పాపులరిటీ లభించింది.ఆమెకు ఎంతో మంది మద్దతు కూడా తెలిపారు.. అయితే ఆ ఇష్యూ నీ శ్రీరెడ్డి రాజకీయంగా వాడుకోవటంతో ఇష్యూ ట్రాక్ మారింది. దీనితో అప్పటివరకు శ్రీరెడ్డి కి సపోర్ట్ చేసిన వారు ఆమెను విమర్శించడం మొదలు పెట్టారు..ప్రస్తుతం శ్రీరెడ్డి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా పని చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: