మరో ఆరు రోజులలో ‘దేవర’ ఫలితం తెలియబోతోంది. ఈ మూవీ కలక్షన్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తుందని తారక్ అభిమానులు చాల ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీకి సంబంధించిన బెనిఫిట్ షోలు మిడ్ నైట్ షోల విషయంలో ఇప్పటికి క్లారిటీ రాకపోయినప్పటికి రాబోయే గురువారం అర్థరాత్రి నుండి తెలుగు రాష్ట్రాలలో ‘దేవర’ ధియేటర్ల వద్ద హడావిడి తారా స్థాయిలో ఉండబోతోంది.



ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న లీకులు ప్రకారం ఈసినిమా ఫైనల్ కట్ 2 గంటల 50 నిముషాలు అని తెలుస్తోంది. ఈ మూవీ నిడివి ఈస్థాయిలో ఉండటంతో ఈ మూవీ నిడివిని ప్రేక్షకులకు అసహనం కలగకుండా ఎంతవరకు తగ్గించగలిగే అవకాశం ఉంది అన్న విషయంలో కొరటాల శివ మరియు ఈమూవీ నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.



తెలుస్తున్న సమాచారంమేరకు ఎన్ని ఆలోచనలు చేసినప్పటికీ ఈమూవీ నిడివి 8 లేదంటే 10 నిముషాలు మించి తగ్గించే ఆస్కారం కనిపించడం లేదని లీకులు వస్తున్నాయి. ఈ నిడివి తగ్గింపు ప్రక్రియలో ‘దావూది దావూది’ పాటను సినిమా పూర్తి అయ్యాక వచ్చే టైటిల్స్ ఎండ్ కార్డు సమయంలో ప్లే చేస్తే ఎలా ఉంటుంది అన్న విషయమై ప్రస్తుతం తర్జనబర్జనలు జరుగుతున్నట్లు టాక్.



అయితే ఇప్పటికే ఈపాట బాగా పాపులర్ అయిన నేపధ్యంలో ఈపాటను సినిమా నిడివి నుంచి తొలిగించి ఎండ్ కార్డు సమయంలో ప్లే చేస్తే తారక్ అభిమానుల నుండి విపరీతమైన అసహనం వచ్చే ఆస్కారం ఉంది అన్న సూచనలు కూడ వస్తున్నట్లు టాక్. జూన్ లో విడుదలైన ‘కల్కి 2898’ నిడివి ఎక్కువ ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఏమాత్రం అసహనానికి లోనవ్వకుండా సినిమాను ఎంజాయ్ చేసిన పరిస్థితులలో ‘దావూది దావూది’ పాటను సినిమాలోనే ఉంచాలని ఈమూవీ బయ్యర్ల నుండి కొరటాల శివ పై ఒత్తిడి వస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈవిషయమై కొనసాగుతున్న సస్పెన్స్ ఈమూవీ విడుదల అయ్యేంతవరకు కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: