వచ్చే సంక్రాంతి పండుగకు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద వార్ జరిగే పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. త్రిష ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా , ఎంఎం కీరవాణి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కూడా ఇప్పటికే ప్రకటించింది. నందమూరి నటన సింహం బాలకృష్ణ , బాబీ దర్శకత్వంలో ఎన్ బి కె 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ విడుదల తేదీని ఇప్పటి వరకు మేకర్స్ ప్రకటించలేదు. కానీ ఈ సినిమాను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో నిలిపే ఆలోచనలు మేకర్స్ ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన ఈ ముగ్గురు హీరోలు సంక్రాంతి బరిలో నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో నాగర్జున ఒక్కడు ఈ సంక్రాంతి బరిలో మిస్ అయ్యాడు అని చాలా మంది అనుకున్నారు.

కానీ ఆ కుటుంబం నుండి నాగ చైతన్య ఈ సారి సంక్రాంతి బరిలో నిలవబోతున్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య ప్రస్తుతం తండెల్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం వారు ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే కానీ జరిగితే వచ్చే సంక్రాంతి పండుగకు తెలుగు ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన ఈ నాలుగు కుటుంబాల నుండి సినిమాలు విడుదల అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: