తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప కథ రచయితగా పేరు తెచ్చుకున్న వారిలో విజయేంద్ర ప్రసాద్ ఒకరు . ఈయన అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకుడు అయినటువంటి రాజమౌళి తండ్రి . ఈయన రాజమౌళి సినిమాలకు మాత్రమే కాకుం డా అనేక ఇతర సినిమాలకు కూడా కథలను అందించి దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు . కొంత కాలం క్రితం మాస్ మహారాజా రవితేజ హీరో గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం లో విక్రమార్కుడు అనే మూవీ వచ్చిన విషయం మనకు తెలిసిందే . ఈ మూవీ భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది . ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు.

ఇది ఇలా ఉంటే ఒకానొక ఈవెంట్లో రవితేజ ఉన్నాడు. విజయేంద్ర ప్రసాద్ఈవెంట్ లో ప్రసంగిస్తున్నాడు. అందులో భాగంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ... రవితేజ నువ్వు విక్రమార్కుడు సినిమా చేశావు. ఆ సినిమాను తమిళ్లో ఒక స్టార్ హీరో చేశాడు. కన్నడ లో మరో స్టార్ హీరో చేశాడు. వారంతా ఆ మూవీని రీమేక్ చేసిన కూడా నువ్వు మాత్రం నీ యాక్టింగ్ తో వారందరికంటే గొప్ప స్థాయిలో నిలిచావు అని అన్నాడు. దీనితో స్టేజి కింద ఉన్న రవితేజ ఆయన మాటలకు రెండు చేతులు దండం పెట్టాడు.

ఇలా విజయేంద్ర ప్రసాద్ "విక్రమార్కుడు" మూవీలోని రవితేజ నటనను ఎంతగానో ప్రశంసించాడు. ఇకపోతే విక్రమార్కుడు సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటించాడు. ఒక పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించగా , మరొక పాత్రలో దొంగగా కనిపించాడు. ఈ రెండు పాత్రల్లో కూడా అద్భుతమైన వైవిధ్యాన్ని చూపించిన రవితేజ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో రవితేజ కు బ్లాక్ బాస్టర్ విజయం కూడా దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: