•ఇష్టం లేకపోతే ధైర్యంగా చెప్పగలగాలి..

•కెరియర్ పై భయం ఉన్నవారే లొంగిపోతారు..

•మాటలు చెప్పడం సులభం.. అనుభవించే వారి బాధ వర్ణనాతీతం..



సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఏ రేంజ్ లో ప్రకంపనలు సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా ముందుకు వస్తూ తమ బాధను చెప్పుకుంటున్నారు. దీనికి తోడు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ 16 సంవత్సరాల అమ్మాయి పై దాదాపు నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన తాజాగా వెలుగులోకి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. అత్యాచారానికి పాల్పడ్డారని,  ఆమెపై ఇష్టంతోనే ఇలా చేశాను అంటూ నేరం ఒప్పుకున్నట్టు తాజాగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో చేర్చారు.


ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై ప్రముఖ సీనియర్ నటి సత్య కృష్ణన్ ఊహించని కామెంట్లు చేశారు. అక్క,  వదిన పాత్రలతో మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె ఆనంద్ , బొమ్మరిల్లు వంటి చిత్రాలతో తెలుగు వారికి మరింత దగ్గర అయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. మా అమ్మ నాన్న ఇద్దరూ బ్యాంకు ఉద్యోగులే.  నాన్నది గుంటూరు అయితే అమ్మది రాజమండ్రి. మేము పుట్టి పెరిగింది అంతా హైదరాబాదులోని నాన్న చనిపోయాక నాన్న ఫ్రెండ్స్ మాకు సపోర్టుగా నిలిచారు. ఆర్థికంగా కూడా మాకు సహాయం చేశారు. అయితే ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అనుకోకుండానే నేను సినిమాల్లోకి వచ్చాను అంటూ సత్య తెలిపింది.

ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే అంత సులభం కాదు. ముఖ్యంగా ఇన్నేళ్ల కెరియర్లో నన్ను ఇబ్బంది పెట్టింది ఏదీ లేదు. అలా అని ఇండస్ట్రీ అంటే కేక్ వాక్ కాదు పనిచేసేటప్పుడు ఎవరైనా సరే ఏమైనా అంటే పట్టించుకోవద్దు. ముఖ్యంగా విసుక్కోవడం,  తిట్టడం అనేది సర్వసాధారణం. నేను మీతో ఎలా ఉన్నానో.. మీరు నాతో అలా ఉండండి అంటూ నేనెప్పుడూ చెబుతూ ఉంటాను. ఇక కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతి చోట ఉంది. సముద్రంలో నీటితో పాటు ఉప్పు కూడా ఉన్నట్టే ఇది అంతే.. పని ప్రదేశాలలో ముఖ్యంగా అమ్మాయిలకు ఇలాంటి సమస్యలు తప్పవు.  అయితే నాకు ఇలాంటివి అనుభవంలోకి రాలేదు కానీ ఎవరైనా అలాంటి వైబ్స్ ఇచ్చినా కూడా నా లైన్లోకి రానివ్వను. ప్రపంచంలో అందరికంటే అందంగా ఉండేది అమ్మాయిలే కాబట్టి వారే ఇలాంటి సమస్యలు ఎక్కువ ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా మనం ఎలా ఉన్నాము మనల్ని మనం ఎలా కాపాడుకుంటున్నాం అనేది అత్యంత ముఖ్యం.


ఎవరైనా అతి చేసినట్లు అనిపిస్తే నీ లిమిట్స్ లో నువ్వు ఉండని ధైర్యంగా మనం చెప్పగలగాలి. అయితే అలా చెప్తే అవకాశాలు ఇవ్వరేమో అని కెరియర్ గురించి భయపడడం కరెక్ట్ కాదు. ఇది తప్ప ఇంకో ఛాన్స్ లేదనుకునే వాళ్ళు మాత్రమే ఇలాంటి ఒత్తిడికి లొంగిపోతారు. ముఖ్యంగా మాటలు చెప్పడం సులభమే కానీ ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారో మనం ఊహించలేం. ఏదైనా సరే చేయలేనప్పుడు నిర్మొహమాటంగా ధైర్యంగా చెప్పగలగాలి. ఈ పని కాకపోతే ఇంకొక పని. మనకు పని చేతకాకపోతే అలాంటివి చేయాలి అంటూ క్యాస్టింగ్ కౌచ్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సత్య.

మరింత సమాచారం తెలుసుకోండి: