జానీ మాస్టర్ ని నిన్న పోలీసులు రహస్య ప్రదేశంలో విచారించిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ విచారణ సమయంలో జానీ మాస్టర్ తప్పు ఒప్పుకున్నట్టు నాలుగు సంవత్సరాల నుండి ఆ మహిళపై అత్యాచారం చేసినట్టు నేరం ఒప్పుకున్నారని పలు వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై జానీ మాస్టర్ భార్య మాట్లాడుతూ ఇప్పటివరకు రిమాండ్ రిపోర్టే రాలేదు. దానికోసమే మేము ఎదురు చూస్తున్నాము. కానీ కొంతమంది ఫేక్ వార్తలు రాస్తూ నేరం ఒప్పుకున్న జానీ మాస్టర్ అని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు  కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. ఇక పుష్ప సినిమా సెట్ లోనే ఈ గొడవ జరిగింది.. పుష్ప సినిమా సెట్లో గొడవ జరిగింది.. శ్రేష్ట వర్మ మా ఆయన్ని నా ముందు అన్నయ్య అని పిలిచి నేను లేకముందు నన్ను పెళ్లి చేసుకోమని జానీ ని టార్చర్ చేసింది. అంతేకాదు జానీ మాస్టర్ కోసం మతం మార్చుకుంటానని శ్రేష్ట వర్మ నే చెప్పింది.ఇక దీనికి మా ఆయన ఒప్పుకోకపోయేసరికి శ్రేష్ట వర్మ ఓసారి సూసైడ్ కూడా చేసుకోవాలని చూసింది.

ఇక వీరిద్దరి వ్యవహారం నాకు తెలిసి ఎక్కడ జానీ మాస్టర్ నాకు దూరమవుతాడో అని నేను కూడా ఒకసారి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాను. కానీ ఆ బాధిత మహిళా పూర్తిగా రివర్స్ కేసు పెట్టింది. చేసిందంతా ఆమె అయితే పూర్తిగా జానీ మాస్టర్ మీదే నెట్టేసింది. ఇక ఎప్పుడైతే జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు వచ్చిందో అప్పటినుండి ఆయనపై కొంతమంది ఇండస్ట్రీ జనాలు కుట్ర పన్నుతున్నారు.ముఖ్యంగా పుష్ప-2 సినిమా పెద్దల సహాయంతోనే ఆ అమ్మాయి ఈ విషయంలో ముందుకు వచ్చి నా భర్త పై కేసు పెట్టింది. ఆయనపై చేస్తున్న కుట్రలో ఎంతోమంది పెద్దవాళ్లు భాగస్వాములుగా ఉన్నారు. అందుకే ఆ అమ్మాయి అంత ధీమాతో బయటికి వచ్చి కేసు పెట్టింది.

 చేసిందంతా శ్రేష్ట వర్మ అయితే రివర్స్లో కేసు పెట్టి నా భర్తని ఇరికించింది.. బయటికి ఎక్కడికి వెళ్లినా కూడా జానీ మాస్టార్ ని పెళ్లి చేసుకోమని టార్చర్ చేసి చివరికి చచ్చిపోతానని బ్లాక్మెయిల్ కూడా చేసింది. ఇక జానీ మాస్టర్ ని పెళ్లి చేసుకోవాలని చూసిందని నేను శ్రేష్ట వర్మకి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను.ఇక ఎన్నిసార్లు నేను మందలించినా కూడా ఆమె మారకపోయేసరికి ఓ రోజు ఇంటికి వెళ్లి కొట్టబోయా.. కానీ దీన్ని మొత్తం రివర్స్లో చెప్పి నేనే నా భర్తను రెండో పెళ్లి చేసుకోమని శ్రేష్ట వర్మను వేధించి కొట్టినట్టు ఆమె కట్టుకథలు అల్లింది. నేనెందుకు నా భర్తకి రెండో పెళ్లి చేయాలని చూస్తాను అంటూ సుమలత అలియాస్ ఆయేషా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయట పెట్టింది

మరింత సమాచారం తెలుసుకోండి: