నైజాం ఏరియాలో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ను జరుపుకున్న టాప్ 10 మూవీస్ ఏవి ..? అందులో దేవర పార్ట్ 1 మూవీ ఏ స్థానంలో నిలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ నైజాం ఏరియాలో 70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ను జరుపుకుంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమాకు నైజాం ఏరియాలో 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ కి నైజాం ఏరియాలో 60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆది పురుష్ మూవీ కి 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ నైజాం ఏరియాలో జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ , హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ కి నైజాం ఏరియాలో 44 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ నైజాం ఏరియాలో అత్యధిక ఫ్రీ రిలీజ్ బిజినెస్ను జరుపుకున్న సినిమాల లిస్టులో 5 వ స్థానంలో నిలిచింది. ఈ మూవీ సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానుంది. 

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమాకు నైజాం ఏరియాలో 42 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా , ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమాకి 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన సాహో మూవీ కి 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య మూవీ కి 38 కోట్లు , ప్రభాస్ హీరోగా రూపొందిన రాధే శ్యామ్ మూవీ కి 36.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: