తెలుగు బుల్లితెరపై ఏ షో ప్రారంభమైన అంత హడావిడి ఉంటుందో లేదో కానీ.. అటు బిగ్గెస్ట్ రియాలిటీ షో గా పేరు సంపాదించుకున్న బిగ్ బాస్ ప్రారంభమైతే మాత్రం హడావిడి మరో లెవెల్ లో ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు అటు హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా వెళుతూ ఉంటారు. అయితే ప్రొఫెషనల్ లైఫ్ లో ఆయా కంటెస్టెంట్లు ఎలా ఉంటారో చూసిన ప్రేక్షకులు.. పర్సనల్ లైఫ్ లో ఎలా బిహేవ్ చేస్తారో చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకే బిగ్ బాస్ ని ఇక ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా ఫాలో అవుతూ ఉంటారు అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే  బిగ్ బాస్ హౌస్ లో ఇక అందరికీ తెలిసిన సెలబ్రిటీలు ఆడే ఆటలు ఉండే విధానం అన్ని చూస్తూ ఇక ఓటింగ్స్ వేస్తూ వారిని విజేతగా నిలపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాగా ఇప్పుడు బిగ్ బాస్ 8వ సీజన్ ఏకంగా మూడో వారానికి చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మూడో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్ ఎవరైనా సరే బిగ్ బాస్ పెట్టే రూల్స్ ని తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఇక ఎవరు ఆ రూల్స్ ని అతిక్రమించిన వారికి పనిష్మెంట్ ఇవ్వడం కూడా చూస్తూ ఉంటాము.



 అయితే హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లిన అభయ్ మాత్రం గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి ఏకంగా బిగ్ బాస్ రూల్స్ తప్పు అంటూ చెబుతూ ఉండటం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇక ఈ రూల్స్ పెట్టేవారు అసలు మనుషులకే పుట్టారా.. వాళ్లకి దిమాక్ లేదా అంటూ తిట్టడం కూడా చేశాడు అభయ్. దీంతో బిగ్ బాస్ ఆగ్రహంతో ఊగిపోయాడు. కంటెస్టెంట్స్ అందరినీ కూడా ఒకచోట నిలబెట్టి వార్నింగ్ల మీద వార్నింగ్ ఇచ్చాడు. ఇది నా హౌస్ నా రూల్స్ నేనెలా చెబితే అలా నడుచుకోవాలి. ఎవరికైనా బిగ్బాస్ కంటే తాము ఎక్కువ అని భావిస్తే వెంటనే బయటికి వెళ్లిపోవచ్చు అంటూ డోర్స్ కూడా ఓపెన్ చేశాడు. ఇక ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. అయితే అభయ్ కారణంగానే బిగ్ బాస్ ఇలా వార్నింగ్ ఇచ్చాడు అని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ అనుకున్నారు. నేనేం చేశాను నేనేం చేయలేదు మనసులో ఉన్నది మాట్లాడాను అంతే అంటూ అభయ్ చెప్పుకున్నాడు. ఈవారం అభయ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఏం జరగబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: