క్యాస్టింగ్ కౌచ్.. ఈ పేరు ఎప్పుడూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో హీరోయిన్లకు అవకాశాలు రావాలంటే డైరెక్టర్లు ప్రొడ్యూసర్ల కోరిక తీర్చాల్సిందే అనే వాదన ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అలా కోరిక తీర్చకపోతే ఎంత టాలెంట్ ఉన్నా ఉపయోగం లేదు. ఇక అవకాశాలు రాక ఇండస్ట్రీలో కనుమరుగు  అవ్వాల్సిందే అని ఎవరో చెప్పడం కాదు.. ఈ మధ్యకాలంలో ఎంతో మంది హీరోయిన్లు కూడా తమ చేదు అనుభవాలను సోషల్ మీడియాలో ఓపెన్ గా చెప్పేస్తూ ఉన్నారు.


 అయితే ఇండస్ట్రీలో నిజంగానే క్యాస్టింగ్ కౌచ్ ఉందని తమకు అలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అని కొంతమంది నటీమణులు చెబుతుంటే.. క్యాస్టింగ్ కౌచ్ ఉంది అని వినడమే తప్ప తమకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదు అని ఇంకొంతమంది చెబుతున్నారు. ఇక ఈ విషయంపై ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే ఇక ఈ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం గురించి సీనియర్ నటి అన్నపూర్ణమ్మ గతంలో చేసిన కామెంట్స్ కూడా ఇండస్ట్రీలో సంచలనంగా మారిపోయాయి. తప్పు కేవలం ఒకవైపు నుంచి మాత్రమే జరగదని.. ఇష్టం లేకుండా తప్పు జరగదు అంటూ అన్నపూర్ణమ్మ క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.


 కేవలం సినిమా రంగంలోనే కాదు ప్రతి రంగంలోనూ మహిళలు ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇళ్లు, ఫ్యామిలీ, గౌరవం అనే వాటిని దృష్టిలో పెట్టుకొని.. వేటికి లొంగాలి వేటికి లొంగకూడదు అనేది ఇక వారి వారి సొంత నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఇష్టం లేకుండా ఎక్కడ తప్పు జరగదు. తప్పు రెండు వైపులా ఉంటుంది. అయితే అవకాశాల కోసం ఏ మార్గాన్ని ఎంచుకోవాలి అన్నది ఇక వారి వారి చేతుల్లోనే ఉంటుంది. ప్రతి రంగంలో ఈ తప్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ గ్లామర్ ఫీల్డ్ అయిన సినిమాలను పైన అందరూ దృష్టి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది అన్నపూర్ణమ్మ. ఒక రకంగా హీరోయిన్లు ఒప్పుకుంటేనే తప్పు జరుగుతుందని.. ఒప్పుకోకుండా ధైర్యంగా ముందుకు సాగితే ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ కి గురవ్వాల్సిన అవసరమే ఉండదు అంటూ అన్నపూర్ణమ్మ చెప్పుకొచ్చారు. అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: