జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ మూవీ కి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ కార్యక్రమాలు ముగిసిన రోజే ఈ మూవీ కి సంబంధించిన రన్ టైమ్ ను కూడా ఈ మూవీ యూనిట్ లాక్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అందులో భాగంగా ఈ సినిమా 2 గంటల 57 నిమిషాలకు రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వచ్చాయి.

సినిమా దాదాపు మూడు గంటల రన్ టైమ్ తో  ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు రావడంతో సినిమాలో కంటెంట్ అద్భుతంగా ఉన్నట్లయితే ఏమీ కాదు. కానీ సినిమా కాస్త బోరు కొట్టించిన 3 గంటల రన్ టైమ్ ద్వారా ఈ మూవీ కి నెగటివ్ టాక్ వచ్చే అవకాశం ఉంది అని అనేక వార్తల కూడా వచ్చాయి. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సంబంధించిన కొంత రన్ టైమ్ ను తగ్గించినట్లు ఈ 2 రెండు గంటల 46 నిమిషాల టైం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో రవితేజ హీరోగా రూపొందిన టైగర్ నాగేశ్వరరావు , మిస్టర్ బచ్చన్ సినిమాలను , అలాగే కమల్ హాసన్ హీరోగా రూపొందిన భారతీయుడు 2 సినిమాలు భారీ రన్ టైం తో విడుదల అయ్యాయి. విడుదల అయిన తర్వాత నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాల రన్ టైమ్ లను తగ్గించారు. కానీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. అలాంటి ప్రమాదం లేకుండా ఉండేందుకు దేవర యూనిట్ ముందే ఈ సినిమా యొక్క రన్ టైం ను తగ్గించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: