ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలకు మించిన స్థాయిలో చిన్న సినిమాలకు లాభాలు వస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాలకు బడ్జెట్లు ఎక్కువ కావడం , భారీ క్రేజ్ ఉండడంతో ఆ సినిమాలను డిస్ట్రిబ్యూటర్లు భారీ ఎత్తున ధరలు పెట్టి కొనుగోలు చేయడంతో సినిమాలు బ్లాక్ బాస్టర్ అయ్యి వందల కోట్ల కలెక్షన్లు వచ్చినా కూడా లాభాల విషయానికి వచ్చే సరికి ఆ సినిమాలు తక్కువ మొత్తంలో లాభాలను డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తున్నాయి. కానీ చిన్న సినిమాలు మాత్రం భారీ ఎత్తున నిర్మాతలకు , డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెడుతున్నాయి.

చిన్న సినిమాలకు బడ్జెట్ తక్కువ కావడం వల్ల ఆ సినిమాలను నిర్మాతలు రీజనబుల్ రేట్లకు అమ్మి వేస్తున్నారు. ఇక మూవీ లో మంచి విజయాలు సాధించినట్లు అయితే భారీ మొత్తంలో ఆ సినిమాలు డబ్బులు వెనక్కి తెస్తున్నాయి. దానితో డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీ ఎత్తున లాభాలను అందుకుంటున్నారు. ఇకపోతే ఇలా చిన్న సినిమాకు మంచి క్రేజ్ ఉండడంతో ఈ మూవీలకు కొనసాగింపుగా ఈ మధ్యకాలంలో వరస పెట్టి సీక్వెల్స్ ను రూపొందిస్తూ వస్తున్నారు. కొంత కాలం క్రితం డిజె టిల్లు మూవీ మంచి విజయం సాధించడంతో ఆ సినిమాకు కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ అనే మూవీ ని రూపొందించారు. ఆ మూవీ కూడా భారీ విజయాన్ని అందుకొని పెద్ద మొత్తంలో కలెక్షన్లను రాబట్టింది. ఇక కొంత కాలం క్రితం మత్తు వదలరా అనే సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకు కొనసాగింపుగా మత్తు వదలరా 2 సినిమాని కొన్ని రోజుల క్రితం విడుదల చేయగా ఈ మూవీ కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది.

ఇక కొంత కాలం క్రితం మ్యాడ్ అనే మూవీ మంచి విజయం అందుకోగా ఆ మూవీ కి కొనసాగింపుగా మ్యాడ్ 2 మూవీ ని రూపొందిస్తున్నారు. ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇలా ప్రేక్షకులు చిన్న సినిమాలపై ఇంట్రెస్ట్ చూపుతూ ఉండడంతో చిన్న సినిమాగా విడుదల అయ్యి మంచి విజయాలను అందుకున్న సినిమాలకు సీక్వెల్స్ ను రూపొందిస్తూ జనాల్లో మరింత హిప్ ను పెంచుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: