టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటిస్తూ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు. 1979 లో వచ్చిన "నీడ" సినిమాతో మహేష్ బాబు అతిధి పాత్రలో కనిపించి మెప్పించాడు. అనంతరం కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. 1999లో విడుదలైన రాజకుమారుడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి పరిచయమయ్యాడు.


ఆ తర్వాత మహేష్ బాబు నటించిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో నటించిన మహేష్ బాబు తన సినిమాలతో మంచి లైఫ్ ఇచ్చాడు. మహేష్ బాబుతో నటించిన హీరోయిన్లందరూ దాదాపు స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. వయసు పెరిగిన కొద్దీ మహేష్ బాబు అందం ఏమాత్రం తరగడం లేదు. ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తూ అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉన్నాడు. అయితే మహేష్ బాబుకు కేటీఆర్ ఓ సమయంలో వార్నింగ్ ఇచ్చాడట.


శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు ఆగడు సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కేటీఆర్ చూసిన వెంటనే మహేష్ బాబుకు ఫోన్ చేసి ఇలాంటి చెత్త సినిమాలు ఇంకెప్పుడూ చేయకు చేస్తే బాగోదు జాగ్రత్త. మళ్లీ మళ్లీ చెబుతున్నాను ఇంకోసారి ఇలాంటి సినిమాలు చేయకు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలా కేటీఆర్ తనకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడని మహేష్ బాబు ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.


భరత్ అనే నేను సినిమాకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు మహేష్ బాబు. ఈ తరుణం లోనే ఈ విషయాన్ని స్వయంగా మహేష్ చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ బాబు కెరీర్ లోనే బ్రహ్మోత్సవం సినిమా తర్వాత అత్యంత డిజాస్టర్ అయిన సినిమా ఆగడు. ఈ రెండు సినిమాలు మాత్రమే మహేష్ బాబు కెరియర్ లో అత్యంత ఘోర పరాజయాన్ని చవిచూశాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: