రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈశ్వర్ మూవీ తో హీరో గా కెరియర్ను మొదలు పెట్టిన ప్రభాస్ చాలా తక్కువ కాలంలోనే అనేక విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. మిర్చి మూవీ వరకు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగించిన ప్రభాస్ ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సిరీస్ మూవీలతో హీరోగా నటించాడు. ఈ మూవీలు అద్భుతమైన విజయం సాధించడంతో ఒక్క సారిగా ఇండియా వ్యాప్తంగా ప్రభాస్ కి క్రేజ్ లభించింది. దానితో ప్రస్తుతం ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా మూవీ లలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు.

ప్రభాస్ కెరియర్ లో ఓ హీరోయిన్ ఆయనకు బాగా కలిసి వచ్చింది. ఆ హీరోయిన్ తో ప్రభాస్ నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకున్నాయి. ఆమె ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె కాజల్ అగర్వాల్. ప్రభాస్ , కాజల్ అగర్వాల్ కాంబోలో మొదటగా డార్లింగ్ మూవీ వచ్చింది. ఈ సినిమాకు కరుణాకరన్ దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ము అందుకుంది. ఈ సినిమాతో వీరి జంటకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో మిస్టర్ పర్ఫెక్ట్ అనే మూవీ వచ్చింది.

సినిమా కూడా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ మూవీ కి దశరథ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో కూడా ఈ జంటకు మంచి ప్రశంసలు వచ్చాయి. అలా ప్రభాస్ , కాజల్ అగర్వాల్ కాంబో లో రెండు సినిమాలు రాగా ఈ రెండు మూడు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. అలాగే ఈ రెండు సినిమాలలో ఈ జంటకు కూడా మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: