టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు సుకుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ లెక్కలు మాస్టారు సినిమాలు తీయడంలో కూడా క్యాలిక్యులేషన్స్ ఉపయోగిస్తూ సూపర్ డూపర్ హిట్లు సొంతం చేసుకున్నారు. మొదటి సినిమా ఆర్యతోనే సుకుమార్ తెలుగు సినిమా పరిశ్రమపై తనదైన ముద్రను వేసుకున్నారు. ఆ సినిమా నుంచి హీరో అల్లు అర్జున్- దర్శకుడు సుకుమార్ల మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఇక పుష్ప సినిమాతో వీరు ఇద్దరూ పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు.

ఇక అసలు విషయంలోకి వెళితే, సుకుమార్ పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కానీ, సుకుమార్ భార్య తబిత అప్పుడప్పుడు, సినిమా ఫంక్షన్లలో కనబడి అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అందచందాలలో ఆమె హీరోయిన్ లకు ఏమాత్రం తక్కువ కాదు అనే చెప్పుకోవాలి. ఎంతైనా లెక్కలు మాస్టారు కదా.... వీరి ప్రేమ వివాహం కూడా అలాగే జరిగి ఉంటుంది. కాగా ఆమె ప్రస్తుతం 41వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది.. ఈ సందర్భంగా ఆమె, భర్త సుకుమారుతో కలిపి గ్రీస్ ఐలాండ్స్లో తన 40వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. కాగా దానికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అవి కాస్త వైరల్ అవుతున్నాయి. వారి జంటను చూసిన సోషల్ మీడియా ప్రేక్షకులు... వారిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సుకుమార్ తబిత ఇద్దరూ హీరో హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదంటూ తెగ పొగిడేస్తున్నారు. వారు అంటున్నది కూడా నిజమే... వారి ఫోటోలు చూస్తే మనకి కూడా అదే ఫీలింగ్ కలగక మానదు. ఈ నేపథ్యంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆమెకి విషెస్ తెలియజేశాడు.

ఇకపోతే సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా కోసం అల్లు వారి అభిమానులు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలోని ఈ యాక్షన్ ఎపిసోడ్లు ఒక రేంజ్ లో ఉంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. పుష్ప పార్ట్ వన్ హిట్ కావడంతో... ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆమధ్య అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ని కెలకడంతో, సినిమా కలెక్షన్లు ముఖ్యంగా ఏపీలో డ్రాప్ అవుతాయనేది విశ్లేషకుల అంచనా. ఈ విషయం తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!

మరింత సమాచారం తెలుసుకోండి: