మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ అమ్మాయి 2017లో ఓ డాన్స్ షోలో పాల్గొనగా.. ఆ షోకి జడ్జిగా జానీ మాస్టర్ ఉన్నారు. ఆమె ప్రతిభ చూసిన అనంతరం తన వద్ద డ్యాన్స్ అసిస్టెంట్‌గా అవకాశం ఇప్పిస్తానని జానీ హామీ ఇచ్చారు. అలా 2019 నుంచి ఆ యువతి ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలో తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని జానీ మాస్టర్‌పై యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను మైనర్‌గా ఉన్న సమయంలోనే హోటల్‌లో తనపై అత్యాచారం చేశారని యువతి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి అనంతరం నార్సింగి పీఎస్‌కు కేసు బదిలీ

 చేశారు. తాను మైనర్‌గా ఉన్న సమయంలోనే హోటల్‌లో తనపై జానీ అత్యాచారం చేశారని పోలీసులు ఫిర్యాదులో పేర్కొనగా.. పోక్సో యాక్ట్ సైతం జత చేశారు. ఆరోపణలు వచ్చిన అనంతరం జానీ మాస్టర్ పరారీలో ఉండగా.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం గోవాలో ఆయన్ను అరెస్ట్ చేసింది. మరోవైపు, ఈ వ్యవహారం టాలీవుడ్ పరిశ్రమను కుదిపేస్తోంది. బాధితురాలికి పలువురు అండగా నిలిచారు.  తాజాగా జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ లో కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు.

 దురుద్దేశంతోనే మధ్యప్రదేశ్‌కు చెందిన  అమ్మాయి   ని జానీ మాస్టర్ అసిస్టెంట్గా చేర్చుకున్నారని, 2019లోని బాధితురాలతో జానీ మాస్టర్కు పరిచయం ఏర్పడిందని పేర్కొన్నారు. జానీ మాస్టర్ తో పాటు జానీ మాస్టర్ భార్య కూడా ఈ మేరకు బెదిరింపులకు దిగినట్లుగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించడం జరిగింది. ఇక ఈ రిమాండ్ రిపోర్టు ప్రకారం చూస్తే జానీ మాస్టర్ కు కఠిన శిక్ష పడే అవకాశం అయితే కనిపిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: