ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్‌ను శుక్రవారం తెల్లవారుజామున గోవా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో విచారించారు. పలు కీలక అంశాలపై ఆరా తీశారు. హైదర్‌గూడలోని ఓ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ఆయన్ను హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించనున్నారు.ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌  పై పోక్సో యాక్ట్ నమోదు చేయడంతో ఆయన తరఫు న్యాయవాది రంగారెడ్డి జిల్లా

 కోర్టులో బెయిల్ అప్లై చేయనున్నారు. ఈ సందర్బంగా పోలీస్ రిమాండ్ లో కీలక విషయాలను పొందుపరిచారు పోలీసులు. అయితే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌   అరెస్టయిన నేపథ్యంలో ఆయన బాధితులు మరింత మంది బయటికి రానున్నట్లు సమాచారం. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌   చేసిన పనుల గురించి మరో ఇద్దరు డాన్సర్లు షాకింగ్ విషయాలు వెల్లడించనున్నారని టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. దురుద్దేశంతోనే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌  ఆ యువతిని తన దగ్గర అసిస్టెంట్‌గా చేరుకున్నారని తెలిసింది. 2020లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌   అంగీకరించినట్టు రిమాండ్ రిపోర్టులో ఒప్పుకున్నారని తెలుస్తోంది. 

తొలిసారి లైంగిక దాడి జరిగినప్పుడు ఆ యువతి వయస్సు 16 సంవత్సరాలే అని పోలీసులు తేల్చారు. గత నాలుగేళ్లుగా బాధితురాలిపై అనేకమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ అంగీకరించినట్టు రిమాండ్ రిపోర్టులో ఉందని తెలుస్తోంది. ఇలా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ కేసులో రోజుకు ఒక విషయం బయట పడుతున్నాయి. దీంతో టాలీవుడ్ లోనే కాకుండా సర్వత్ర ఈ విషయం లో ఉత్కంఠత రేకెత్తుతోంది. మరి రాబోయే రోజుల్లో ఈ విషయం ఇంకెక్కడి వరకు వెళుతుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: