ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతో సంచలనగా మారిన జానీ మాస్టర్ కేసు రోజుకో విధంగా మలుపు తిరుగుతుంది. ఆయన దగ్గర పనిచేసే అసిస్టెంట్ పై లాంగిక దాడి చేసినట్టు ఆరోపిస్తూ ఆయన పై కేసు పెట్టింది.  ఆమె  ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు గోవాలో జానీ మాస్టర్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ కోర్టులో హాజరపరిచారు.అదేవిధంగా ఆయనకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ ని కూడా కోర్టుకు అందించారు. ఇదె క్రమంలో తనపై వస్తున్న ఆరోపణలన్ని నిజమే అని ఒప్పుకున్నారు. దీంతో ఆయనకు 14 రోజులపాటు రిమాండ్ విధించగా ఆయనను చంచల్గూడా జైలకు తరలించారు.


అయితే ఈ కేసులో మరో సంచలన నిజం బయటకు వచ్చింది. ఈ కేసులో పవర్ స్టార్ హీరో కూడా ఇన్వాల్వ్ అయినట్టు కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే ఈ కేసులో యంగ్ హీరో విశ్వక్సేన్ కూడా ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. ఆయన సినిమా వల్లే బాధితురాలకి, జానీ మాస్టర్ మధ్య విభేదాలు వచ్చాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.


ఇక అసలు విషయం ఏమిటంటే. జానీ మాస్టర్ అసిస్టెంట్ ఎప్పట్లానే విశ్వక్ సేన్ సినిమా సాంగ్ షూటింగ్ కు కొరియోగ్రఫీ చేయడానికి వచ్చిందంట బాధితురాలు. షెడ్యూల్ ప్రకారం ఆరోజు 30 నుంచి 35 షాట్స్ తీయాల్సి ఉంది. పరిస్థితులు అనుకూలించకపోతే కనీసం 15 షాట్స్ అయినా తీయాలి. కానీ బాధితురాలు మాత్రం తన కొరియోగ్రాఫీలో కేవలం 7 షాట్స్ మాత్రమే తీసిందంట. ఇలాంటి అయితే నష్టం తప్పదని విశ్వక్ తో పాటు, నిర్మాత కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆ వెంటనే ఆమెను తీసేసి, మరుసటి రోజు నుంచి మరో మాస్టర్ ను తెచ్చుకున్నారని అప్పటిలో టాక్ నడిచింది.


అయితే ఆమెను జానీ మాస్టర్ కారంగానే తప్పించారట. సినిమా సాంగ్ షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆమెను అనేకసార్లు రమ్మని ఫోన్లు చేశారని సమాచారం. పనిలో ఉన్నప్పుడు జానీ మాస్టర్, బాధితురాల్ని చాలా ఇబ్బంది పెట్టాడట. దీంతో ఆమె వర్క్ పై ఫోకస్ పెట్టలేక, ఆ రోజు షూటింగ్ చెడగొట్టిందని ఓ వర్గం చెబుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్ ను జానీ మాస్టర్ భార్య సుమలత ఖండిస్తున్నారు ఆమె మాట్లాడుతూ.. ఆ అమ్మాయి వర్క్ నచ్చక విశ్వక్ సినిమా నుంచి పంపించేశారు. వర్క్ నచ్చనప్పుడు లక్షల్లో నష్టం వస్తుంది కదా, అందుకే వెంటనే తీసేసి మరో డాన్స్ మాస్టర్ ను తెచ్చుకున్నారు.


అది ఆమె మనసులో పెట్టుకున్నట్టుంది. నిజానికి ఆ ఇష్యూకు జానీ మాస్టర్ కు ఎలాంటి సంబంధం లేదు. ఆ అమ్మాయి ఏ పాట చేయకపోయినా దానికి జానీ మాస్టర్ ఎలా కారణం అవుతారు. ఇలా ఊహించని విధంగా జానీ మాస్టర్ కేసులో విశ్వక్ సేన్ పేరు తెరపైకొచ్చింది. ప్రస్తుతం జానీ మాస్టర్ చంచల్ గూడ జైలులో ఉన్నాడు. అతడికి కోర్టు 2 వారాల రిమాండ్ విధించింది.. ఈ కేసులో ఎవరిదీ అసలు తప్పు..? మాస్టర్ నిజంగానే అలాంటి వాడా? ఇలాంటి అనేక అనుమానాలు బయటకు వస్తున్నాయి. ఇదే క్రమంలో దీనిపై మరింత సమాచారం బయటకు రావాల్సి ఉంది.
[12:22 pm, 21/9/2024] V Subhash:

మరింత సమాచారం తెలుసుకోండి: