యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా మొదటి భాగం విడుదల సందర్భంగా అభిమానులు అప్పుడే థియేటర్ల వద్ద నానా హంగామా సృష్టిస్తున్నారు. ముఖ్యంగా కటౌట్లతో రచ్చ చేస్తున్నారు. పాన్ ఇండియా లేవలో దేవర సినిమాని రిలీట్ చేయబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా మొదటిసారి నటిస్తూ ఉన్నారు. టికెట్ల రేటు విషయంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దేవర టీమ్ కి గుడ్ న్యూస్ తెలియజేసింది. ఏపీలో కాస్త అనుమానంగానే ఉన్నప్పటికీ..


ఇప్పుడు తాజాగా ఏపీ ప్రభుత్వం నుంచి కూడా మరొక గుడ్ న్యూస్ రావడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు. వైసిపి హయాంలో ఏపీలో అదనపు షోలు టికెట్ ధరలు పెంచుకోవడానికి కూడా పెద్దగా అనుమతులు దొరికేవి కావు.. తాజాగా ఏపీలో దేవర సినిమాకి మిడ్ నైట్ షోలు అదనపు షోలు టికెట్లు ధరలు పెంచుకునేందుకు అనుమతి కూడా ఇచ్చినట్లు ఒక జీవోని విడుదల చేశారు. సినిమా విడుదలైనప్పటి నుంచి పది రోజులపాటు ఈ టికెట్ ధరలను పెంచుకునేలా ఏపీ ప్రభుత్వం దేవర సినిమాకి అనుమతి ఇచ్చింది.

ఫస్ట్ క్లాస్ టికెట్ ధరను 110 రూపాయలు.. లోయర్ క్లాస్ టికెట్ ధరను 60 రూపాయల వరకు పెంచుకొని అవకాశాన్ని కల్పించింది.. అదేవిధంగా మల్టీప్లెక్స్ లలో 135 రూపాయలు పెంచుకునేలా అనుమతి ఇచ్చింది. ఈ విషయం మాత్రం దేవర సినిమాకి పెద్ద బూస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు. దీంతో దేవర సినిమాకి తొమ్మిది రోజులపాటు ప్రతిరోజు 5 షోలు ప్రదర్శించుకోవడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు. అయితే ఇలా జీవో విడుదలవ్వగానే ఎన్టీఆర్ ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. అలాగే ఏపీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్లకు ఎన్టీఆర్ కృతజ్ఞతలతో తెలియజేశారు.అభిమానులు దేవర సినిమా దూకుడుకు బ్రేకుల్లేవంటు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: