మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘దేవర’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో ‘దేవర’ యూనిట్ బిజీగా ఉంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్‌ డమ్‌ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్‌ నుంచి రాబోతున్న సినిమా అవ్వడంతో దేవర సినిమా పై సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు కొరటాల శివ సినిమాను రూపొందించాడు. నందమూరి కళ్యాణ్ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని లు

 ఈ సినిమాను దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌ తో నిర్మించడం జరిగింది.  అయితే భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి టిక్కెట్ల రేటు పెంచడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది. దేవ‌ర రిలీజ్ రోజు ఆరు షోల‌తో పాటు మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్లపై రూ.135 వరకూ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్ పై రూ.110, లోయర్ క్లాస్ ఒక్కో టికెటైపై రూ.60 వరకూ పెంచుకోవడానికి అనుమతిని ఇచ్చింది. అలాగే 28వ తేదీ నుంచి 9 రోజులపాటు రోజుకు 5 షోల చోప్పున ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్ర‌భుత్వం. మొదటి రోజు అంటే సెప్టెంబర్ 27వ తేదీన ‘దేవర’ స్పెషల్ షోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. సెప్టెంబర్ 27వ తేదీన అర్థరాత్రి 12 గంటల నుంచి ఆరు షోలు వేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఇక ఈ విషయం కాసేపు పక్కన

 పెడితే గతంలో ఉన్న ఏపీ ప్రభుత్వం ఇదివరకు సినిమాల టికెట్ల రేటు పెంపు విషయంలో కాస్త అటు ఇటుగా ప్రవర్తించారు. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కాబట్టి సినిమాల విషయంలో కాస్త ఆలోచించి ఆంధ్రప్రదేశ్ లో దేవర సినిమా టికెట్ల రేటు పెంచినట్లుగా తెలుస్తోంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదికగా ఏపీ ప్రభుత్వ డిప్యూటీ సీఎం కి ధన్యవాదాలు తెలిపారు..  దేవర సినిమా విడుదల నిమిత్తం నూతన జీవోని ఆమోదించినందుకు, తెలుగు సినిమా పరిశ్రమకు నిరంతరం మద్దతు ఇస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. గౌరవనీయులు సీఎం చంద్రబాబు నాయుడుగారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌గారికి నా ధన్యవాదాలు..’ అని పేర్కొన్నారు. అయితే మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావాలని ఇలా చేశారు అని అంటున్నారు ఎందుకంటే గతంలో జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ మధ్య జరిగిన వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ వివాదాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ కి ఫేవరెజం చేస్తున్నాడు అని అంటున్నారు.!!

మరింత సమాచారం తెలుసుకోండి: