మన స్టార్స్ ఎక్కడో ఒక చోట ఇమేజ్ చట్రంలో ఇరుక్కుని మంచి కథ సినిమాలను చేసేందుకు నిరాకరిస్తారు కానీ కొందరు అలా కాదు. కథ నచ్చిందా వెంటనే అది ఎలాంటి సినిమా అయినా చేస్తారు. అలా కథ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేసే వారిలో కోలీవుడ్ స్టార్ ధనుష్ ముందుంటాడు. ఈమధ్యనే రాయన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ధనుష్ ఓ పక్క శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర సినిమా చేస్తూనే మరోపక్క తన దర్శకత్వంలో మరో సినిమా మొదలు పెట్టాడు. ధనుష్ డైరెక్షన్ లో వస్తున్న సినిమాకు టైటిల్ గా ఇండ్లీ కొట్టు అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

ఈ సినిమాకు సంబందించిన ప్రీ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇడ్లీ కొట్టు వెరైటీ టైటిల్ తో వస్తున్న ధనుష్ ఈ సినిమాలో ఇడ్లీ హోటల్ నడిపించే వ్యక్తిగా కనిపించనున్నారు. రాయన్ తో డైరెక్టర్ గా కూడా అదుర్స్ అనిపించిన ధనుష్ ఆ కాన్ ఫిడెన్స్ తో మరో సినిమా పట్టాలెక్కించాడు. ఇడ్లీ కొట్టు కథ ఏంటి దీనిలో ఎవరెవరు భాగం కానున్నారన్నది తెలియాల్సి ఉంది.

ధనుష్ కొత్త సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ లో జోష్ మొదలవుతుంది. కచ్చితంగా ఆయన చేసిన ఆర్ట్ సినిమాల మాదిరిగానే ఈ ఇడ్లీ కొట్టు కూడా వాటి సరసన చేరే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. ఇడ్లీ కొట్టు సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి. ధనుష్ చూస్తుంటే ఇక మీదట తన డైరెక్షన్ లో కూడా వరుస సినిమాలు చేసేలా ఉన్నాడని అనిపిస్తుంది. ఈ సినిమాకు జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తుండగా డాన్ పిక్చర్స్, వండర్ బార్ మూవీస్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో హీరోయిన్స్ గా నిత్యా మీనన్, షాలిని పాండే నటిస్తున్నారని కోలీవుడ్ టాక్.  


మరింత సమాచారం తెలుసుకోండి: