ఐతే దానికన్నా ముందే బాలీవుడ్ లో యుధ్రా అంటూ తన లక్ టెస్ట్ చేసుకుంది. సిద్ధాంత్ చతుర్వేది లీడ్ రోల్ లో తెరకెక్కిన యుధ్రా సినిమాలో మాళవిక రెచ్చిపోయి మరీ నటించింది. బాలీవుడ్ లో మొదటి ఆఫర్ కదా అక్కడ ఆడియన్స్ ని మెప్పించాలని అలా చేసింది. కానీ అమ్మడి ప్లాన్ రివర్స్ అయ్యింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన యుధ్రా సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.
యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా రొటీన్ స్టోరీ స్క్రీన్ ప్లేతో వచ్చిందని ఆడియన్స్ తమ రివ్యూ ఇచ్చారు. మాళవిక అనవసరంగా ఈ సినిమా కోసం ఒక రేంజ్ లో రెచ్చిపోయింది. ఐతే మాళవిక మొదటి హిందీ సినిమానే ఆమెకు బిగ్ షాక్ ఇచ్చింది. నెక్స్ట్ ప్రభాస్ రాజా సాబ్ మీదే అమ్మడి హోప్స్ అన్ని పెట్టుకుంది. స్టార్ కటౌట్ అయినా కూడా తన కథల ఎంపికల వల్ల వెనకపడ్డ మాళవిక రాజా సాబ్ తర్వాత తెలుగులో సత్తా చాటాలని చూస్తుంది. ఆ సినిమా రిలీజ్ వరకు తెలుగులో అమ్మడు మరో సినిమా ఓకే చేయకపోవడం వెనక భారీ స్కెచ్ ఉందని అర్ధమవుతుంది. మరి మాళవికకు తెలుగు ఎంట్రీ అయినా కలిసి వస్తుందేమో చూడాలి.