దేవర గర్జనకు థియేటర్లో దద్దరిల్లిపోయేందుకు అంత సిద్ధమవుతుంది. ఎక్కడ చెరిగిపోతామో అని ఇండస్ట్రీ రికార్డులు కూడా భయపడిపోతున్నాయి. ఏకంగా ధైర్యానికి కూడా భయం పుట్టించడానికి దేవర వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీ ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే.


రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రిబుల్ ఆర్ లాంటి వరల్డ్ వైడ్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలోగా చేస్తున్న మొదటి మూవీ కావడంతో ఈ మూవీపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి అటు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఎక్కడ చూసినా కూడా దేవర మేనియానే కనిపిస్తుంది. ఈ సినిమాకు ఏర్పడిన బజ్ చూస్తూ ఉంటే ఏకంగా ఎన్నో ఇండస్ట్రీ రికార్డులను తుడిచి పెట్టేయడం ఖాయమని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది అని చెప్పాలి. సినిమా పాటలు అయితే యూట్యూబ్లో ఎంత సెన్సేషన్ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 ఇక ఎప్పుడూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరికీ కూడా దేవర మూవీ టీం ఒక అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈరోజు ఉదయం 11:07 గంటలకి దేవర రిలీజ్ ట్రైలర్ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. కళ్ళల్లో ఆవేశం అతని వెనుక మారణ హోమంతో దేవర వస్తున్నాడు అంటూ ట్రైలర్ పై అభిమానుల్లో అంచనాలను పెంచేసింది మూవీ టీం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పియ్యగా.. ఇక ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ చూసేందుకు అభిమానులు అందరూ కూడా సిద్ధమైపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: