సూపర్ స్టార్ రజనీకాంత్.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు లేడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈయన కేవలం ఒక సాదాసీదా హీరో మాత్రమే కాదు. ఎంతో మంది యువకుల్లో స్ఫూర్తి నింపే ఒక ఇన్స్పిరేషన్. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిన ఒక గొప్ప వ్యక్తి. మనం ఎలా ఉన్నాం అన్నది కాదు మనలో టాలెంట్ ఎంత ఉంది అన్నదే ముఖ్యం అని నిరూపించిన ఒక గొప్ప స్టార్. ఒక సాదాసీదా బస్ కండక్టర్ స్థాయి నుంచి ఏకంగా కోట్లాదిమంది సినీ ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టుకున్న సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు రజనీకాంత్.


 కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా హవా నడిపిస్తూ ఉన్నారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అనే తత్వం ఆయనలో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. అందుకే నేటి రోజుల్లో ఎంతోమంది యువతకి అటు రజినీకాంత్ ఒక స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచే రజినీకాంత్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచే నటుడు ఒకరు ఉన్నారట. ఇటీవలే ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు ఆయన. ప్రస్తుతం వెట్టయాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది. ఈ మూవీలో కీలక పాత్రలో అమితాబచ్చన్ కనిపించబోతున్నారు.


 ఈ క్రమంలోనే తనకు ఇన్స్పిరేషన్ ఎవరు అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు రజనీకాంత్. వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగాను తనకు ఎంతో స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి అమితాబ్ బచ్చన్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవలే జరిగిన వెట్టయాన్ ఆడియో లాంచ్ ఈవెంట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే వెట్టయాన్ సినిమాలో అమితాబ్ నటించేందుకు ఒప్పుకోగానే తనలో ఎంతగానో ఉత్సాహం పెరిగిపోయింది అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పుకొచ్చాడు. ఇక పహాద్ ఫాజిల్ పాత్ర ఎంతో భిన్నంగా ఉంటుందని అయినప్పటికీ అతను ఎంతో ఈజీగా నటించేసాడు అంటూ రజిని ప్రశంసించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: