యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మొదలు అయినప్పుడు కొంత శాతం పాజిటివ్ , కొంత శాతం నెగటివ్ తోనే ఈ మూవీ స్టార్ట్ అయింది. అందుకు ప్రధాన కారణం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరో ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై పాజిటివ్ అంచనాలు ఉంటే , ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ తర్వాత కొరటాలమూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై కాస్త శాతం జనాలు పెద్ద స్థాయిలో అంచనాలు పెట్టుకోలేదు.

మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుండగా అందులో మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా ప్రచార చిత్రాలను ఈ మూవీ యూనిట్ విడుదల చేయడం అవి అద్భుతంగా ఉండడంతో కొరటాల పై ఉన్న ఆ నెగెటివిటీ కూడా పోయి ఈ సినిమాపై అద్భుతమైన రేంజ్ లో ప్రస్తుతం జనాల్లో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఉంది ఇది ఇలా ఉంటే ఆర్ చరణ్ , శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే మూవీ ని చాలా కాలం క్రితం మొదలు పెట్టిన విషయం మనకు తెలిసిందే.

మూవీ మొదలు అయినప్పుడు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి ప్రధాన కారణం చరణ్ ఈ మూవీ లో హీరో గా నటించడం , దానికి శంకర్ దర్శకత్వం వహించడం. ఇక కొంత కాలం క్రితం శంకర్ దర్శకత్వం వహించిన ఇండియన్ 2 మూవీ ఘోర పరాజయాన్ని అందుకుంది. దానితో గేమ్ చేంజర్ మూవీ పై ప్రేక్షకుల్లో ప్రస్తుతానికి భారీ అంచనాలు లేవు. మరి ఈ సినిమా ప్రచారాలు మొదలు అయిన తర్వాత ఈ మూవీ లోని కంటెంట్ తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: