ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా బాలకృష్ణ మాత్రం ఇక తన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. మరీ ముఖ్యంగా అటు మాస్ ప్రేక్షకులు బాలయ్య సినిమా వస్తుందంటే చాలు పూనకాలు వచ్చి ఊగిపోతూ ఉంటారు అని చెప్పాలి. బాలయ్య మాస్ డైలాగ్ వెర్షన్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తూ ఉంటాయి.



 హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తనదైన స్టైల్ లోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు బాలకృష్ణ. 60 ఏళ్ల వయస్సు దాటిపోతున్న కూడా ఇంకా యంగ్ హీరోలకు పోటీ ఇచ్చే విధంగా సినిమాలు చేస్తున్నారు. ఇంకోవైపు అన్ స్టాపబుల్ అంటూ వ్యాఖ్యాతగా మారి ప్రేక్షకులందరికీ కూడా మరింత దగ్గరవుతున్నారు ఆయన. నందమూరి బాలకృష్ణ ఎప్పుడు ఎంత సరదాగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య ఇతర హీరోల షూటింగ్ జరుగుతున్న సెట్ లోకి వెళ్లడం ఇప్పటివరకు చాలా సార్లు చూసాం. ఇక ఇప్పుడు మరోసారి ఇదే చేశారు. మరో సీనియర్ హీరో అయిన వెంకటేష్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతున్న సెట్స్ లోకి వెళ్ళాడు.



 ఈ క్రమంలోనే డైరెక్టర్ అనిల్ రావిపూడి హీరో విక్టరీ వెంకటేష్ తో సరదాగా కాసేపు గడిపారు నందమూరి బాలకృష్ణ. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. భగవంతు కేసరి మూవీ నుంచి బాలయ్య డైరెక్టర్ అనిల్ కు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే అటు వెంకటేష్ సినిమా షూటింగ్ సెట్ కి నందమూరి బాలకృష్ణ సరదాగా వెళ్ళినట్లు తెలుస్తోంది. నట సింహం తమను చూసేందుకు వచ్చారు అంటూ అటు మూవీ టీం ఒక వీడియోని విడుదల చేయగా ఇది వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: