ప్రస్తుతం కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోగా కొనసాగుతూ ఉన్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్నీ తెలుగులో అంతంత మాత్రమే ఆడిన ఇతర భాషల్లో మాత్రం భారీ వసూళ్లు  సాధించాయి. ఇక సలార్ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కిన ప్రభాస్ మొన్నటికి మొన్న కల్కి సినిమాతో మళ్లీ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసి తన సత్తా ఏంటి అన్న విషయాన్ని నిరూపించారు.


 వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఎక్కుతున్న సినిమాలలో నటిస్తున్న ప్రభాస్.. ఇక ఇప్పుడు తన అభిమానులు అందరికీ కూడా వరుసగా సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉన్నాడు అని చెప్పాలి. కేవలం ఎనిమిది నెలల గ్యాప్ లోనే అటు సలార్ కల్కి మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఇక ఎప్పుడూ రాజా సాబ్ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ మూవీ కోసం డార్లింగ్ ఫాన్స్ అందరు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ మూవీలో వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నామని ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ ద్వారా అందరికీ అర్థమైంది.


 దీంతో ఈ మూవీ విడుదల కోసం ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే త్వరలోనే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందబోతుంది అన్నది తెలుస్తుంది. ఇటీవల కాలంలో స్టార్ హీరోల బర్త్ డే రోజున ఇక అభిమానులకు మేకర్స్ సర్ ప్రైస్ ఇస్తూ ఉండటం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభాస్ బర్త్ డే కూడా ఇలాంటి సర్ప్రైజ్ కి అభిమానులు సిద్ధంగా ఉండాలట. ఎందుకంటే ప్రభాస్ పుట్టిన రోజు అయిన అక్టోబర్ 23వ తేదీన ఇక రాజా సాబ్ టీజర్ విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: