మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరో గా ఎదిగే క్రమం లో ఆయనకు కొంత మంది దర్శకులు అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాలను అందించారు . అలా చిరంజీవి కి బ్లాక్ బాస్టర్ విజయాలను ఎక్కువ అందించిన దర్శకుల లో కే రాఘవేందర్రావు ఒకరు . ఇక పోతే రాఘవేంద్రరావు మొత్తంగా చిరంజీవి తో తన కెరీర్లో 14 సినిమాలను చేశాడు . అందులో 12 సినిమాలు చిరంజీవి హీరో గా రూపొందిగా , ఒక సినిమా లో చిరంజీవి విలన్ పాత్రలో నటించగా , మరో సినిమాలో రెండవ హీరో పాత్రలో నటించాడు . మరి రాఘవేంద్రరావు , చిరంజీవి తో హీరో గా కాకుండా తెరకెక్కించిన ఆ రెండు సినిమాలు ఏవి వాటి వివరాలను తెలుసుకుందాం.

చిరంజీవి , రాఘవేంద్రరావు కాంబినేషన్లో మొదటగా మోసగాడు అనే మూవీ వచ్చింది. ఈ సినిమాలో శోభన్ బాబు హీరోగా నటించగా , శ్రీదేవిమూవీ లో హీరోయిన్గా నటించింది. శ్రీదేవి ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించి తన నటనతో ప్రేక్షకులను బాగనే ఆకట్టుకుంది. ఇకపోతే ఈ మూవీ లో చిరంజీవి విలన్ పాత్రలో నటించి తన అద్భుతమైన తనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

చిరంజీవి , రాఘవేంద్రరావు కాంబినేషన్లో రెండవ సినిమాగా తిరుగులేని మనిషి మూవీ వచ్చింది. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించగా , చిరు ఈ మూవీ లో రెండవ హీరోగా నటించాడు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు.

ఇలా చిరంజీవి , రాఘవేంద్రరావు కాంబినేషన్లో మొదటగా వచ్చిన రెండు సినిమాలలో ఒక సినిమాలో చిరంజీవి విలన్ గా నటిస్తే మరొక సినిమాలో రెండవ హీరోగా నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: