సౌత్ సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన వారిలో హీరోయిన్ సిమ్రాన్ కూడా ఒకరు. దక్షిణాది సినీ ఇండస్ట్రీలోని అగ్ర హీరోయిన్గా అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న సిమ్రాన్ ఎన్నో బ్లాక్బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ మధ్యనే మళ్లీ రీయంట్రీ ఇచ్చి పలు చిత్రాలలో కీలకమైన పాత్రలో నటిస్తున్నది సిమ్రాన్. తాజాగా సిమ్రాన్ తన ఇంస్టాగ్రామ్ లో  ఒక పోస్ట్ షేర్ చేస్తూ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చింది. వాటి గురించి చూద్దాం.


సిమ్రాన్ పై గత కొన్నేళ్లుగా పలు రకాల రూమర్స్ రావడంతో ఆమె ఒక్కసారిగా ఫైర్ అయ్యింది. ఇన్ని రోజులు వస్తున్న రూమర్స్ చూసి సైలెంట్ గా ఉన్నాను కానీ ఇప్పుడు అసలు ఊరుకునేది లేదు అంటూ తెలిపింది.. తనకి కూడా ఆత్మగౌరవం అనేది ఉందని అది చాలా ముఖ్యమంటూ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ ని వెల్లడించింది.. తాను ఏ పెద్ద హీరోతో పని చేయాలని కోరిక తనకు లేదని ఇప్పటికే వారితో ఎన్నో సినిమాలలో నటించాను.. తనకు చాలానే లక్ష్యాలు ఉన్నాయని అవి చాలా భిన్నంగా ఉన్నాయి.. నా లిమిట్స్ ఏంటో నాకు తెలుసు అంటూ తెలిపింది.


ఒకరితో మరొకరిని ముడిపెడుతూ ఇన్నాళ్లుగా తనపైన సోషల్ మీడియాలో పలు రకాల రూమర్స్ వస్తున్నాయి అయినా సైలెంట్ గా ఉన్నాను కానీ ఇటీవలే తన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా చేశారు.. ఇది చాలా శక్తివంతమైన పదము కాబట్టే ఆపమని చెబుతున్నాను.. తనని సినిమా  తీయమని ఎవరు సంప్రదించలేదు ఆ ప్రయత్నాలు కూడా చేయలేదు నా మనోభావాలు పట్టించుకోకుండానే నా పేరు, ఫేమ్ ఎప్పుడూ కూడా దుర్వినియోగం చేసుకోలేదు.. ఎప్పుడైనా సరే సరైన దానికోసమే నిలబడ్డానంటూ తెలిపింది.. తన పైన దుష్ప్రచారం చేస్తున్న వారు క్షమాపణలు చెప్పాలి అంటూ ఒక పోస్ట్ ని షేర్ చేసింది.


గత కొంతకాలంగా సిమ్రన్ నిర్మారంగంలోకి అడుగు పెట్టాలనుకుందని ఇందుకోసం హీరో విజయ్ తో కలిసి ఒక భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేస్తోందని అందుకు విజయ్ ను సంప్రదించగా ఆ హీరో పెద్దగా మక్కువ చూపలేదని నిర్మాణరంగం అంత సేఫ్ కాదని కూడా సలహా ఇచ్చారనే విధంగా వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ వార్తలన్నిటికీ దిమ్మతిరిగేలా  ఇచ్చేసింది  సిమ్రాన్. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఆ హీరో అభిమానులకు, హీరోకి కూడా కౌంటర్ ఇచ్చాలా.. అలాగే ఈ రూమర్స్ స్ప్రెడ్ చేసిన వారికి  కూడా కౌంటర్ వేసేలా సిమ్రన్ ఈ పోస్ట్ షేర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: