తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న మైనర్ బాలికపై అత్యాచారం కేసులో స్టార్ కొరియోగ్రాఫర్, జనసేన పార్టీ నాయకుడు జానీ మాస్టర్‌‌ అరెస్ట్ అయ్యి.. చంచల్ గూడ జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. పోలీసుల కళ్లు కప్పి.. గోవా పారిపోయిన జానీ మాస్టర్‌ను గురువారం నాడు అరెస్ట్ చేసి.. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ తీసుకొచ్చారు. ఉప్పరపల్లి కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు. జానీకి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌ను కోర్టు విధించింది. దీంతో అతడిని చంచల్‌గూడ జైలుకి పంపించారు. వచ్చే నెల 3వ తేదీ వరకు చంచల్‌గూడ జైలులోనే జానీ ఉండాలి. ఈ లోపల పోలీసులు జానీ

 మాస్టర్‌ను కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఇదిలవుండగా ఇప్పుడు ఈ కేసు విషయంలో బిగ్ బాస్ విష్ణు ప్రియ పేరు సంచలనంగా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. జానీ మాస్టర్ బాధిత యువతిపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లు విష్ణు ప్రియకు ముందే తెలుసట. వాస్తవానికి విష్ణు ప్రియ, బిగ్ బాస్ మానస్ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ వీడియో ఒక రేంజ్ లో పాపులర్ అయిన తెలిసిందే. ఆ డాన్స్ పెర్ఫార్మెన్స్ కి బాధిత యువతి కొరియోగ్రఫీ అందించారు. ఇదిలా ఉండగా స్టార్ కొరియోగ్రాఫర్, జనసేన పార్టీ నాయకుడు జానీ మాస్టర్‌‌   లేడీ కొరియోగ్రాఫర్ పై కన్ను వేసిన విషయం విష్ణుప్రియకు తెలిసినా కూడా ఆమె నోరు మెదపలేదని తెలుస్తోంది. ఇందులో భాగంగానే విష్ణు ప్రియ

 కారణంగా ఇప్పుడు బిగ్ బాస్ కి పోలీస్ నోటీసులు పంపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా విష్ణు ప్రియ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈమె కోసమే బిగ్ బాస్ హౌస్ కి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు అని సమాచారం. ఇక ఈ కారణంగా రేపు వారంలో హౌస్ నుంచి విష్ణుప్రియ ఎప్పుడైనా అవుట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: